లండన్‌లో జరుగుతున్న గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్ టోర్నీలో స్విస్ మాస్టర్ రోజర్ ఫెదరర్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ ఫెదరర్ 3-6, 6-1, 6-2, 6-2తో హారిస్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. తొలి సెట్లో అనూహ్యంగా ప్రత్యర్థి నుంచి పోటీ ఎదుర్కొన్న రోజర్.. 3-6తో సెట్‌ను చేజార్చుకున్నాడు. ఆ తర్వాత ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. మూడు సెట్లలో వరుసగా రెండేసిసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన ఫెదరర్.. ముందంజ వేశాడు.
ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (కెనడా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. అతను 7-4, 1-7, 3-6, 0-6తో సామ్ క్వెరె (అమెరికా) చేతిలో ఓడాడు. కిర్గియోస్ (ఆస్ట్రేలియా), నిషికోరి (జపాన్), సోంగా (ఫ్రాన్స్) రెండో రౌండ్ చేరారు. మరో మ్యాచ్‌లో మూడో సీడ్ నాదల్ 6-3, 6-1, 6-3తో సుగిటా (జపాన్)పై నెగ్గాడు.
మహిళల విభాగంలో..
మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్ బార్టీ (ఆస్ట్రేలియా) ముందంజ వేసింది. తొలి రౌండ్లో ఆమె 6-4, 6-2తో జెంగ్ (చైనా)ను ఓడించింది. సెరెనా 6-2, 7-5తో మాంటికోన్ (ఇటలీ)పై నెగ్గగా... కెర్బర్ (జర్మనీ) 6-4, 6-3తో మరియా (జర్మనీ)ని ఓడించింది. కొంటా (బ్రిటన్), స్టీఫెన్స్ (అమెరికా), క్విటోవా (చెక్ రిపబ్లిక్) ముందంజ వేశారు.