ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత సీనియర్ క్రీడాకారుడు రోహన్ బోపన్న-షపోవలోవ్ ద్వయం రెండో రౌండ్‌కు చేరింది. బోపన్న తన తోటి కెనడా ఆటగాడు షపోవలోవ్‌తో కలిసి నాలుగో సీడ్ ఫ్రెంచ్ జోడీ పియర్-నికోలస్ ద్వయంతో తలపడ్డాడు. ఈ మ్యాచ్‌ను 6-3, 6-1 తేడాతో గెలిచిందీ జోడీ. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్ 55 నిమిషాల్లో ముగిసింది.
మరో జోడీ లియాండర్ పేస్-గల్లెర్మో తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. వీరు మియోమిర్-కాస్పర్ చేతిలో 5-7, 2-6 తేడాతో ఓటమిపాలై ఇంటిముఖం పట్టారు.
ఇదీ చదవండి...యూఎస్ ఓపెన్: బాలుడిని బుజ్జగించిన నాదల్