ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆష్లీ బార్టీ కైవసం చేసుకుంది. ఫైనల్లో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ వొంద్రుసోవాపై విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 6-1, 6-3 తేడాతో కేవలం 70 నిమిషాల్లోనే ఆట ముగించింది ఆసిస్ ప్లేయర్.
బార్డీకి ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. ప్రస్తుతం టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న బార్టీ... మ్యాచ్ ఆరంభం నుంచే వొంద్రుసోవాపై ఆధిపత్యం చెలాయించింది.
"నమ్మలేకపోతున్నాను. విజయానందంలో నాకు మాటలు రావట్లేదు. మ్యాచ్ సంతృప్తికరంగా సాగింది. ఈ రెండు వారాలు చాలా కష్టపడ్డాను. గెలిచినందుకు చాలా గర్వంగా ఉంది"
- ఆష్లీ బార్టీ, ఆసీస్ టెన్నిస్ ప్లేయర్
46 ఏళ్లలో ఓ ఆస్ట్రేలియా క్రీడాకారిణీ ఫ్రెంచ్ ఓపెన్ గెలవడం ఇదే తొలిసారి. 1976లో మార్గరేట్ కోర్టు ఫ్రెంచ్ టైటిల్‌ను నెగ్గింది.
ఇది చదవండి:WC19: ఆనాటి ఓటములకు ఇంగ్లాండ్ ప్రతీకారం