ETV Bharat / sports

Australian Open 2022: జకోవిచ్​పై వీడిన ఉత్కంఠ - ఆస్ట్రేలియన్​ ఓపెన్​ 2022 నొవాక్​ జకోవిచ్

Djokovic Australian Open 2022: ఈ నెల 17న ప్రారంభంకానున్న ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో జకోవిచ్​ ఆడతాడా? లేదా? అన్న సందిగ్ధతకు తెరపడింది. 'మినహాయింపు అనుమతి' లభించడం వల్ల కరోనా టీకా వేసుకోకుండానే ఈ మెగాటోర్నీలో పాల్గొంటున్నట్లు అతడు తెలిపాడు.

Djokovic Australian Open 2022
నొవాక్​ జకోవిచ్​ ఆస్ట్రేలియన్​ ఓపెన్​
author img

By

Published : Jan 5, 2022, 6:42 AM IST

Djokovic Australian Open 2022: ఆస్ట్రేలియన్​ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ బరిలో దిగుతాడా? లేదా? అన్న సందిగ్ధానికి తెరపడింది. సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌లో తాను పాల్గొంటున్నట్లు జకోవిచ్‌ తెలిపాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు తనకు 'మినహాయింపు అనుమతి' లభించిందని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నాడు.

నిబంధనల ప్రకారం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనాలంటే రెండు డోసుల టీకా వేయించుకోవాలి లేదా స్వతంత్ర నిపుణుల బృందం ఇచ్చే వైద్యపరమైన మినహాయింపు అనుమతి కలిగి ఉండాలి. ఒక్క డోసు టీకా కూడా తీసుకోని జకో మినహాయింపు అనుమతితో టోర్నీలో పాల్గొంటున్నాడు. "విరామ సమయాన్ని ప్రియమైన వాళ్లతో అద్భుతంగా గడిపా. మినహాయింపు లభించడం వల్ల ఆస్ట్రేలియాకు బయల్దేరుతున్నా. చలో 2022" అని జకోవిచ్‌ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: Australian open 2021: సానియా, బోపన్న జోడీలు ముందంజ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.