ETV Bharat / sports

ఫిలిప్​ ఐలాండ్​ ట్రోఫీలో అంకిత శుభారంభం - Ankita Raina, a young Indian tennis player

భారత టెన్నిస్​ యువ ప్లేయర్​ అంకిత రైనా ఫిలిప్​ ఐలాండ్​ ట్రోఫీలో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్​ తొలి రౌండ్లో ఇటలీ ప్లేయర్​ కొకారెటోపై విజయం సాధించింది. 5-7, 6-1, 6-2 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది.

Ankita Raina, a young Indian tennis player, won the first round of the Philip Island Trophy.
ఫిలిప్​ ఐలాండ్​ ట్రోఫీలో అంకిత శుభారంభం
author img

By

Published : Feb 15, 2021, 6:53 AM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్లో డబుల్స్​లో తొలి రౌండ్లోనే ఓడిన భారత యువ కెరటం అంకిత రైనా.. ఫిలిప్​ ఐలాండ్ టెన్నిస్​ ట్రోఫీలో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్​ తొలి రౌండ్లో ఆమె 5-7, 6-1, 6-2తో కొకారెటో (ఇటలీ)పై విజయం సాధించింది. రెండు గంటలకు పైగా సాగిన ఈ పోరులో తొలి సెట్లో ఓడినా.. రెండు, మూడు సెట్లలో పుంజుకుని ఆమె విజయాన్ని అందుకుంది.

డబ్ల్యూటీఏ టూర్​ ఈవెంట్లో సింగిల్స్​ మెయిన్​ డ్రాలో అంకితకు ఇదే తొలి విజయం. ఈ గెలుపుతో ఆమె 181 ర్యాంకు నుంచి 156వ ర్యాంకుకు చేరనుంది. ఒకవేళ ఈ టోర్నీలో మరింత ముందుకెళ్తే అంకిత టాప్​-150లో చోటు సంపాదించే అవకాశం ఉంది. డబ్ల్యూటీఏ థాయ్​లాండ్​ ఓపెన్లో మెయిన్​డ్రాలో ఆడిన అంకిత.. అక్కడ తొలి రౌండ్లోనే ఓడింది.

ఇదీ చదవండి: 'తొలి టెస్టులో ఇంగ్లాండ్​ సారథి పొరపాటు చేశాడు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.