పాకిస్థాన్‌లో వచ్చే నెల 14, 15 తేదీల్లో జరగనున్న డేవిస్ కప్ మ్యాచ్‌లపై భారత టెన్నిస్ సంఘం(ఏఐటీఎఫ్)... మరోసారి అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్(ఐటీఎఫ్)కు లేఖ రాసింది. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అందులో పేర్కొంది. వేదిక మార్చాలని... లేదంటే పరిస్థితి చక్కబడేవరకు మ్యాచ్‌లను వాయిదా వేయాలని కోరింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటల్లో పాల్గొనే అవకాశం లేదని స్పష్టంచేసింది భారత టెన్నిస్ సంఘం.
గతంలో భారత టెన్నిస్ సంఘం వేదిక మార్చాలని కోరగా.. ఆ అభ్యర్థనను తిరస్కరించింది ఐటీఎఫ్. ఇటీవల భారత ఆటగాళ్లు తమ భద్రతపై భయాందోళనలు వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఈ టోర్నీ కోసం మహేశ్ భూపతి సారథ్యంలో ఆరుగురు ఆటగాళ్ల జట్టును ప్రకటించింది భారత టెన్నిస్ సంఘం.
ఇవీ చూడండి...డేవిస్ కప్: భారత బృందం పర్యటనపై అదే ప్రతిష్టంభన