వింబుల్డన్‌కు అర్హత సాధించిన అతి పిన్న క్రీడాకారిణిగా చరిత్రలో పేరు లిఖించుకుంది అమెరికాకు చెందిన కోరీ గాఫ్. 15 ఏళ్ల 122 రోజుల వయసున్న ఈమె... గురువారం బెల్జియానికి చెందిన 19వ సీడ్ గ్రీట్ మినెన్ను ఓడించి ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్‌లో 6-1, 6-1తో విజయం సాధించిన గాఫ్.. వింబుల్డన్ మెయిన్‌డ్రాకు అర్హత పొందింది. 2009లో బ్రిటన్‌కు చెందిన లారా రాబ్సన్ ఈ ఫీట్ సాధించిన పిన్నవయస్కురాలు. గాఫ్ వింబుల్డన్‌కు అర్హత సాధించిన 12వ ప్లేయర్. గతంలో ఈ స్థాయి వరకు 11 మంది వెళ్లినా తుది పోరులో క్వాలిఫై కాలేకపోయారు.
-
Remember the name.
— Wimbledon (@Wimbledon) June 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Aged 15 years and 122 days, America’s @CocoGauff becomes the youngest #Wimbledon qualifier in the Open Era after beating Greet Minnen 6-1, 6-1 pic.twitter.com/PSWlOiRNkB
">Remember the name.
— Wimbledon (@Wimbledon) June 27, 2019
Aged 15 years and 122 days, America’s @CocoGauff becomes the youngest #Wimbledon qualifier in the Open Era after beating Greet Minnen 6-1, 6-1 pic.twitter.com/PSWlOiRNkBRemember the name.
— Wimbledon (@Wimbledon) June 27, 2019
Aged 15 years and 122 days, America’s @CocoGauff becomes the youngest #Wimbledon qualifier in the Open Era after beating Greet Minnen 6-1, 6-1 pic.twitter.com/PSWlOiRNkB
వైల్డ్‌కార్డ్...
వింబుల్డన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాలంటే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ఉండాల్సిన అవసరం లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇందులో ఆడే అవకాశం లభిస్తుంది. కానీ గత మ్యాచ్‌లలో ప్రదర్శన ఆధారంగా వైల్డ్‌కార్డ్ పొందుతారు ఆటగాళ్లు.
కోరీ గాఫ్.. గతేడాది జరిగిన జూనియర్ వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లింది. ఫ్రెంచ్ ఓపెన్ అమ్మాయిల ఛాంపియన్షిప్ గెలుచుకుంది. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వాలిఫయింగ్ మ్యాచ్ గెలిచిన యువ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. వరల్డ్ ర్యాంకిగ్స్‌లో 874వ స్థానం నుంచి ఎనిమిది నెలల కాలంలో 301వ ర్యాంక్‌కు చేరింది. ఈ ప్రదర్శన కారణంగానే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది.
గతంలో 15వ ఏట వింబుల్డన్ మెయిన్‌డ్రాకు అర్హత సాధించిన లారా రాబ్సన్... జూనియర్ వింబుల్డన్ గెలుచుకోవడం వల్లే వైల్డ్‌కార్డు గెలుచుకుంది. కోరీ గాఫ్ గనుక ఈ ఏడాది వింబుల్డన్ గెలిస్తే ఈ గ్రాండ్‌స్లామ్ సాధించిన చిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టిస్తుంది. 1887లో ఛార్లెట్ 15 ఏళ్ల 285 రోజుల వయసులో వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది.