ETV Bharat / sports

'టీమ్ఇండియా బ్యాటింగ్​ షాక్​కు గురిచేసింది'

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)​లో టీమ్ఇండియా వరుస ఓటముల పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొదటి మ్యాచ్​లో పాక్​ చేతిలో ఓడిన భారత్(ind vs pak t20)​.. రెండో మ్యాచ్​లో కివీస్(ind vs nz t20)​కు అప్పనంగా విజయాన్ని కట్టబెట్టింది. తాజాగా ఈ మ్యాచ్​పై స్పందించిన పాక్ మాజీ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్(inzamam ul haq on india loss).. కోహ్లీసేన బ్యాటింగ్ తీరు చూసి షాకయ్యానని తెలిపాడు.

Inzamam
ఇంజమామ్
author img

By

Published : Nov 2, 2021, 11:39 AM IST

టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)లో టీమ్‌ఇండియా ఆటతీరు పట్ల ఇంటా బయటా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలో నిలిచిన కోహ్లీసేన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమై సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించేందుకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా న్యూజిలాండ్‌(ind vs nz t20)తో ఆటతీరు ఏమాత్రం ఆకట్టుకోలేదు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌(ind vs pak t20)తో ఓడాక కూడా రెండో మ్యాచ్‌లో తమ తప్పులు తెలుసుకున్నట్లు కనిపించలేదు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ మాజీ సారథి ఇంజామామ్‌ ఉల్‌ హక్‌(inzamam ul haq on india loss) టీమ్‌ఇండియా ఆటతీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా కోహ్లీసేన బ్యాటింగ్‌ చూసి షాకయ్యానన్నాడు.

"భారత్‌-పాక్‌(ind vs pak t20) తర్వాత ఇదే అతిపెద్ద మ్యాచ్‌. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ కన్నా భారత్‌-న్యూజిలాండ్‌దే కీలకం‌. అయితే, టీమ్‌ఇండియా ఆడిన తీరుతో నేను షాక్‌కు గురయ్యా. ఆటగాళ్లంతా మనోస్థైర్యం కోల్పోయారు. అంతపెద్ద జట్టు ఇంత ఒత్తిడికి ఎలా గురైందో అర్థంకావడం లేదు. కివీస్‌ స్పిన్నర్లు మెరుగైన బౌలర్లే అయినా.. ప్రపంచ శ్రేణి స్పిన్నర్లు మాత్రం కాదు. వాళ్లు వేసే బంతులకు భారత బ్యాట్స్‌మన్‌ సింగిల్స్‌ కూడా తీయలేకపోయారు. జట్టు సారథి విరాట్‌ కోహ్లీ బలమే స్పిన్‌ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కోవడం. అలాంటిది అతడే పరుగులు చేయలేక ఇబ్బందులు పడ్డాడు" అని ఇంజమామ్‌ తన యూట్యూబ్‌ ఛానల్లో అభిప్రాయపడ్డాడు.

కాగా, పాకిస్థాన్‌(ind vs pak t20)తో మ్యాచ్‌లో 151/7 స్కోర్‌ చేసిన టీమ్‌ఇండియా.. కివీస్‌(ind vs nz t20)తో మరింత పేలవ ప్రదర్శన(110/7) చేసింది. దీంతో ఆ రెండు జట్లు టీమ్‌ఇండియాపై ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ముందున్నాయి.

ఇవీ చూడండి: బబుల్ నిబంధనలు అతిక్రమణ.. అంపైర్​పై నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.