టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) భాగంగా ఆదివారం(అక్టోబరు 31) న్యూజిలాండ్‌తో (IND VS NZ) తలపడనుంది టీమ్ఇండియా. ఈ సందర్భంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో (IND VS PAK) పేలవ ప్రదర్శన చేసిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య చుట్టూనే చర్చ నడుస్తోంది. ఐపీఎల్ 2021 రెండో దశ నుంచే అతడు బౌలింగ్ చేయడం లేదు. బ్యాట్‌తోనూ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతడిని తిరిగి భారత్ పంపించేయాలని భారత సెలక్టర్లు భావించారట. అయితే హార్దిక్ ఫినిషింగ్ స్కిల్స్‌ను దృష్టిలో ఉంచుకొని అతడిని జట్టులో కొనసాగించాలని మాజీ సారథి, ప్రస్తుత మెంటార్ ఎంఎస్ ధోనీ (MS Dhoni Latest News) సూచించినట్లు బీసీసీఐ వర్గాల సమాచారం.
-
MS Dhoni discussing about power hitting with Hardik Pandya in the nets #T20WorldCup pic.twitter.com/QIgkWhzrbY
— India Fantasy (@india_fantasy) October 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">MS Dhoni discussing about power hitting with Hardik Pandya in the nets #T20WorldCup pic.twitter.com/QIgkWhzrbY
— India Fantasy (@india_fantasy) October 28, 2021MS Dhoni discussing about power hitting with Hardik Pandya in the nets #T20WorldCup pic.twitter.com/QIgkWhzrbY
— India Fantasy (@india_fantasy) October 28, 2021
సమస్య ఎప్పటి నుంచో!
"హార్దిక్ ఫిట్‌నెస్‌పై చర్చ (Hardik Pandya Fitness News) ఆరు నెలలుగా జరుగుతోంది. అతడి భుజానికి గాయమైందని (Hardik Pandya Injury) ఇప్పుడంటున్నారు. దీనివల్ల ఫిట్‌గా ఉండి, మంచి ప్రదర్శన చేసేవారు అవకాశం కోల్పోతున్నారు. జట్టును ఉపయోగపడనివారిని ఆడించడం మంచిది కాదు." అని సంబంధిత వర్గాలే అభిప్రాయపడ్డాయి.
న్యూజిలాండ్‌తో మ్యాచ్ నేపథ్యంలో నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు పాండ్య. దీంతో అతడు బౌలింగ్ చేస్తాడమో అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
-
■■■■■■■■■■■□□□ LOADING@hardikpandya7 | #TeamIndia | #T20WorldCup pic.twitter.com/hlwtrGDfNR
— BCCI (@BCCI) October 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">■■■■■■■■■■■□□□ LOADING@hardikpandya7 | #TeamIndia | #T20WorldCup pic.twitter.com/hlwtrGDfNR
— BCCI (@BCCI) October 28, 2021■■■■■■■■■■■□□□ LOADING@hardikpandya7 | #TeamIndia | #T20WorldCup pic.twitter.com/hlwtrGDfNR
— BCCI (@BCCI) October 28, 2021
ఎవరిది బాధ్యత?
హార్దిక్‌కు సరైన ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించకుండా ఎంపిక చేయడం పట్ల సెలక్టర్లపై తీవ్ర విమర్శలు చేశాడు మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్.
"తుది జట్టులో హార్దిక్‌ను ఎంపిక చేయడం కెప్టెన్, కోచ్ చేతుల్లో ఉంది. కానీ, ఒక ప్లేయర్ ఫిట్‌గా లేకపోతే అతడిని తీసుకోవాలా వద్దా అనేది సెలక్టర్ల చేతుల్లోనే ఉంటుంది. ప్రపంచకప్ జట్టులోకి తీసుకునేముందు హార్దిక్‌కు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాల్సింది. అతడి ఎంపిక పట్ల ఎవరో ఒకరు బాధ్యత వహించాలి. రోహిత్ శర్మ, రహానె అతడు ఫిట్‌గా ఉన్నాడని అంటున్నారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు అతడు అన్‌ఫిట్‌గా ఉంటే అతడిని ఫిట్‌గా ఉన్నాడని ఎలా అనుకోవాలి? ఇది ప్రపంచకప్. మామూలు సిరీస్ కాదు కదా!" అని పాటిల్ అన్నాడు.
ఇదీ చూడండి: T20 World Cup: 'గత ఖ్యాతితోనే జట్టులో హార్దిక్, భువీ'