టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) సూపర్-12 స్టేజీలో వరుస విజయాలతో గ్రూప్-2 నుంచి అగ్రస్థానంతో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది పాకిస్థాన్. సెమీస్‌లో భాగంగా నేడు (నవంబర్ 11) ఆస్ట్రేలియా(aus vs pak t20)తో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా ఇలాంటి కీలకపోరు ముందు ఈ జట్టు విజయాల్లో ముఖ్యపాత్ర పోషించిన షోయబ్ మాలిక్(shoaib malik news), మహ్మద్ రిజ్వాన్ అస్వస్థతకు గురయ్యారు. చిన్నపాటి జలుబు లక్షణాలతో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదు. దీనిపై స్పందించిన ఓ పాక్ అధికారి.. వారికి కాస్త జలుబు, జ్వరంగా ఉందని వెల్లడించారు.
ఈ సెమీస్(aus vs pak t20)లో ఎలాగైనా గెలిచి ఫైనల్ చేరుకోవాలని అటు ఆస్ట్రేలియా, ఇటు పాకిస్థాన్ పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్‌పై గెలిచాక పాకిస్థాన్.. దుర్భేద్యంగా మారిపోయింది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. కాగా, ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌పై ఓడిపోయాక బలంగా పుంజుకుంది. మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి సెమీస్‌కు చేరుకుంది.