టీ20 ప్రపంచకప్లో నమీబియాతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్లు తడబడ్డారు. ధాటిగా ఆడలేకపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి.. 163 పరుగులు చేసింది. దీంతో నమీబియా ముందు 164 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. కివీస్ ఓపెనర్లు గప్తిల్ (18), మిచెల్ (19) ఆకట్టుకోలేదు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (28) ఫర్వాలేదనిపించాడు.
అయితే చివరి ఓవర్లలో ఫిలిప్స్ (39), నీషమ్ (35) మెరుపులతో చెప్పుకోదగ్గ స్కోరు చేసింది కివీస్. నమీబియా బౌలర్లలో బెర్నార్డ్, వైస్, జెరార్డ్ తలో వికెట్ తీశారు.