కజకిస్థాన్‌లో జరిగిన ఆసియన్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో భారత పురుష రెజ్లర్లకు పరాభవం ఎదురైంది. జాతీయ ఛాంపియన్ సందీప్ సింగ్మన్(74 కేజీ)తో పాటు సుమిత్ మాలిక్(125 కేజీ), సత్యవర్త్ కడియన్(97 కేజీ).. పోటీల్లో ఓడి, టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయారు.
సెమీఫైనల్లో ఇరాన్ రెజ్లర్ యోనెస్ అలీ అక్బర్ చేతిలో సందీప్ సింగ్.. ఇరాన్ కుస్తీ పోటీదారుడు ఆస్కారి మహమ్మదియన్ చేతిలో సత్యవర్త్ సెమీస్‌లో ఓటమి పాలయ్యాడు. సందీప్ ఓటమితో వెటరన్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఒలింపిక్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. టోక్యో బెర్త్ దక్కించుకునే అవకాశం అతడికి మెండుగా ఉంది.
వీరందరికీ మే 6 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ క్వాలిఫయర్స్ పోటీల ద్వారా మరో అవకాశం దక్కనుంది.
ఇదీ చదవండి: ఒలింపిక్స్‌కు మరో ఇద్దరు మహిళా రెజర్లు అర్హత