ETV Bharat / sports

టోక్యో ఒలింపిక్స్​కు రెజ్లర్​ సుమిత్​​ అర్హత - ప్రపంచ రెజ్లింగ్​ క్వాలిఫయర్స్​

టోక్యో ఒలింపిక్స్​కు భారత రెజ్లర్​ సుమిత్ మాలిక్​ అర్హత సాధించాడని స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(సాయ్​) ప్రకటించింది. బల్గేరియాలోని సోఫియాలో జరుగుతోన్న ప్రపంచ రెజ్లింగ్​ క్వాలిఫయర్స్​ ఫైనల్​కు చేరిన సుమిత్.. ఒలింపిక్స్​కు అర్హత సాధించిన ఏడో రెజ్లర్​గా నిలిచాడని తెలిపింది. ​

Wrestler Sumit Malik qualifies for Tokyo Olympic Games
టోక్యో ఒలింపిక్స్​కు రెజ్లర్​ సుమిత్​ మాలిక్​ అర్హత
author img

By

Published : May 7, 2021, 3:23 PM IST

భారత రెజ్లర్​ సుమిత్​ మాలిక్​ టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు. బల్గేరియాలోని సోఫియాలో జరుగుతోన్న ప్రపంచ రెజ్లింగ్​ క్వాలిఫయర్స్​ 125 కేజీల విభాగంలో ఫైనల్​కు చేరాడు. దీంతో అతడు ఒలింపిక్స్​లో ఆడేందుకు అర్హత సాధించాడని స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(సాయ్​) ప్రకటించింది.

"సుమిత్​ మాలిక్​ టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బల్గేరియాలోని సోఫియాలో జరుగుతోన్న ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్​​ 125 కేజీల విభాగంలో ఫైనల్​కు చేరి విశ్వక్రీడల్లో ఆడేందుకు అర్హత సాధించాడు. ఒలింపిక్స్​కు అర్హత సాధించిన ఏడో రెజర్ల్​గా.. నాలుగో పురుష రెజర్ల్​గా సుమిత్​ మాలిక్​ నిలిచాడు".

- స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా

ప్రపంచ రెజ్లింగ్​ టోర్నీలోని సెమీఫైనల్స్​లో వెనిజులాకు చెందిన జోస్​ డానియల్​ డియాజ్​ రొబెర్టిపై 5-0 తేడాతో సుమిత్​ మాలిక్​ విజయం సాధించాడు. అంతకుముందు క్వార్టర్స్​లో తజికిస్థాన్​కు చెందిన రుస్తుమ్​ ఇస్కందర్​ను 10-5 తేడాతో ఓడించాడు.

ఈ టోర్నీలో పాల్గొన్న ఇతర భారత రెజ్లర్లు అమిత్​ ధన్​కర్​ (74 కేజీలు), సత్యవర్త్​ కడియాన్​ (97 కేజీలు) టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించలేకపోయారు.

ఇదీ చూడండి: నాదల్, ఒసాకాను వరించిన ప్రతిష్ఠాత్మక లారస్​ అవార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.