డబ్ల్యూడబ్ల్యూఈ(WWE) స్టార్, భారత రెజ్లర్ గ్రేట్ కాళీ(దలీప్ సింగ్ రానా) తల్లి ఆదివారం మరణించింది. గత కొన్నిరోజుల నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. లుధియానాలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి.
దలీప్ సింగ్.. 2000లో రెజ్లర్‌గా ఫ్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈలోనూ అడుగుపెట్టి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోవైపు పంజాబ్ డిపార్ట్మెంట్లో పోలీసు అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే కాకుండా నాలుగు హాలీవుడ్, రెండు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఫేమ్‌లో ఈ ఏడాది చోటు దక్కించుకున్నాడు గ్రేట్ కాళీ.