ETV Bharat / sports

పసిడి పోరులో అన్షు ఓటమి.. సరితకు కాంస్యం - అన్షు మలిక్

ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్​లో(wrestling world championship 2021) ఫైనల్​ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్​ అన్షు మాలిక్(Anshu Malik wrestler) రజతంతో సరిపెట్టుకుంది. 57 కిలోల తుది సమరంలో హెలెన్ మారోలిస్​ చేతిలో పరాజయం చవిచూసింది అన్షు. అలాగే, భారత్​కు చెందిన సరిత మోర్​ కాంస్యం గెలుచుకుంది.

anshu malik, saritha
అన్షు మలిక్, సరిత
author img

By

Published : Oct 8, 2021, 6:57 AM IST

అన్షు మాలిక్‌కు తీవ్ర నిరాశ! ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో(wrestling world championship 2021) ఫైనల్‌ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన ఈ 19 ఏళ్ల అమ్మాయి(anshu malik news) పసిడి కల చెదిరింది. ఆఖరి మెట్టుపై తడబడిన ఆమె(Anshu Malik Wrestler) రజతానికే పరిమితమైంది. గురువారం జరిగిన 57 కిలోల తుది సమరంలో అన్షు 1-4తో 2016 ఒలింపిక్‌ ఛాంపియన్‌, 2020 ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత హెలెన్‌ మారోలిస్‌ చేతిలో పరాజయం చవిచూసింది. ఈ పోరులో ఆరంభంలో అన్షు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.

విరామ సమయానికి 1-0 ఆధిక్యంలో నిలిచింది అన్షు. అయితే విరామానంతరం హెలెన్‌ దూకుడు పెంచింది. అన్షుపై పట్టు సంపాదించిన హెలెన్‌ ఎంతకీ విడవలేదు. కుడి చేతిని చిక్కించుకుని వదలని హెలెన్‌.. వరుసగా పాయింట్లు సాధించింది. తీవ్ర నొప్పితో విలవిల్లాడిన అన్షు ఆమె పట్టు నుంచి బయటపడలేకపోయింది. బలహీనంగా మారిన ఆమెను వెనక్కి తిప్పి మ్యాట్‌పై పడేసిన హెలెన్‌ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటి వరకు అన్షు లేవలేకపోయింది. ప్రథమ చికిత్స అనంతరం ఆమె నిరాశతో వెనుదిరిగింది.

anshu malik
అన్షు మాలిక్

మరోవైపు సరిత మోర్‌ (59 కిలోలు)(Sarita Mor Wrestler) కాంస్యం గెలుచుకుంది. కంచు పోరులో(wrestling world championship) సరిత 8-2తో లిండ్‌బర్గ్‌ (స్వీడన్‌)పై విజయం సాధించింది. ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. మొత్తం మీద ఈ టోర్నీ చరిత్రలో పతకం గెలిచిన ఆరో భారత రెజ్లర్‌గా సరిత ఘనత సాధించింది. అన్షు కాకుండా గీతా ఫొగాట్‌ (2012), బబితా ఫొగాట్‌ (2012), పూజ దండా (2018), వినేశ్‌ ఫొగాట్‌ (2019) పతకాలు నెగ్గారు. అయితే గీత, బబితా, పూజ, వినేశ్‌ కాంస్యాలు సాధించారు.

saritha
సరిత

ఇదీ చదవండి:ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అన్షు మలిక్​ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.