World Archery Championships : వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో భారత్ తొలి స్వర్ణ పతకం సాధించింది. బెర్లిన్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో భారత ప్లేయర్లు జ్యోతి సురేఖ, ప్రణీత్ కౌర్, అదితి గోపీచంద్.. మహిళల కాంపౌండ్ విభాగంలో బంగారు పతకాన్ని ముద్దాడారు. ఈ ముగ్గురు పోటీల్లో ఎదురైన ప్రత్యర్థులను ఓడిస్తూ.. ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఫైనల్స్‌లో మెక్సికోకు చెందిన డఫ్నే క్విన్‌టెరో, అనా సోఫా హెర్నాండెజ్, అండ్రే బెసెర్రాతో భారత త్రయం తలపడింది. తుదిపోరులోనూ జోరు ప్రదర్శిస్తూ.. రెండో సీడ్ భారత జట్టు 235-229 తేడాతో టాప్ సీడ్ మెక్సికోపై గెలిచి జయకేతనం ఎగురవేసింది.
-
New history is made in the morning of Berlin.🏹
— World Archery (@worldarchery) August 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
World title holders for compound teams decided.#WorldArchery pic.twitter.com/dcrciZEeVn
">New history is made in the morning of Berlin.🏹
— World Archery (@worldarchery) August 4, 2023
World title holders for compound teams decided.#WorldArchery pic.twitter.com/dcrciZEeVnNew history is made in the morning of Berlin.🏹
— World Archery (@worldarchery) August 4, 2023
World title holders for compound teams decided.#WorldArchery pic.twitter.com/dcrciZEeVn
కాగా ఫైనల్స్‌లో పటిష్ఠమైన మెక్సికో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చలాయించారు భారత క్రీడాకారిణులు. మొదటి రౌండ్లో 60కి 59 స్కోర్‌తో తుదిపోరును ఘనంగా ఆరంభించారు. ఈ రౌండ్లో మెక్సికో జట్టు 57 పాయింట్లు సాధించింది. ఇక వరుసగా రెండు, మూడు రౌండ్లలోనూ 59 పాయింట్లు సాధించి.. ఆఖరి రౌండ్‌కు ముందు 177-172తో భారత ప్లేయర్లు లీడ్‌లో ఉన్నారు.
ఇక చివరి రౌండ్.. ఆఖరి సెట్లో 207 - 199 ఉన్న దశలో ప్రత్యర్థి ప్లేయర్లు 30 పాయింట్లు సాధించి 229 వద్ద నిలిచారు. ఆ దశలో భారత త్రయంలో మొదట పర్ణీత్ 10 పాయింట్లు గెలిచింది. తర్వాత అదితి 9 పాయింట్లు సాధించింది. విజయానికి మరో ఐదు పాయింట్లు అవసరమైన దశలో సురేఖ.. విల్లు ఎక్కుపెట్టి 9 పాయింట్లు నెగ్గి.. భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపింది.
ఈ పోటీల్లో భారత త్రయం సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కొలంబియాను ఎదుర్కొంది. ఈ పోరులో ప్రత్యర్థి జట్టును 220-216 తేడాతో ఓడించి ఫైనల్స్‌లో అడుగుపెట్టింది.
"మా దృష్టి అంతా ఆట పైనే ఉంచాం. అయితే మేము ఇప్పటికే చాలాసార్లు రజతం సాధించాం. కానీ ఈసారి స్వర్ణ పతకం గెలవాలని దృఢంగా నిశ్చయించుకున్నాం. ఈ గెలుపు ఆరంభం మాత్రమే. మున్ముందు అనేక పతకాలు సాధించాలి. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ఇదే మొదటి స్వర్ణం. ఇది మాకు ఎప్పటికీ ప్రత్యేకమే. మాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన కోచ్, సహాయన టీమ్‌కు థ్యాంక్స్. వ్యక్తిగత విభాగంలోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి.. మరో స్వర్ణం సాధించాలనుకుంటున్నా"
- జ్యోతి సురేఖ.
కాగా మహిళల వ్యక్తిగత విభాగంలో శనివారం జరగనుంది. ఈ పోరులో జ్యోతి.. తన సహచర ఆర్చర్ పర్ణీత్‌తోనే తలపడనుంది. మరో క్వార్టర్స్‌లో అదితి.. నెదర్లాండ్స్ ప్లేయర్ డి లాత్‌ను ఎదుర్కోనుంది.