ETV Bharat / sports

వినేశ్‌ ఫొగాట్‌ సంచలన నిర్ణయం - కేంద్రానికి ఖేల్​రత్న రిటర్న్!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 7:36 PM IST

Updated : Dec 26, 2023, 8:18 PM IST

Vinesh Phogat Khel Ratna : ప్రముఖ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తన వద్దనున్న 'ఖేల్ రత్న', 'అర్జున' అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ఆమె ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన మంత్రికి రాసిన ఓ లేఖలో ఆమో పేర్కొంది.

Vinesh Phogat  Khel Ratna
Vinesh Phogat Khel Ratna

రెజ్లింగ్ సమాఖ్య వివాదం ఓ కొలిక్కి రాక ముందే స్టార్​ అథ్లెట్​ వినేశ్‌ ఫొగాట్‌ ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తనకు సత్కరించిన 'ఖేల్​రత్న', 'అర్జున' అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ఆమె ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన ఓ లేఖలో తెలిపింది. "నేను నా మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న, అలాగే అర్జున అవార్డును తిరిగి ఇస్తున్నాను" అంటూ వినేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆ లేఖలో పేర్కొంది.

"గౌరవనీయులైన ప్రధాన మంత్రికి

సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌ నుంచి తప్పుకుంది. బజరంగ్‌ పునియా కూడా తన పద్మశ్రీని తిరిగిచ్చేశాడు. ఇందుకు గల కారణాలు ఏంటో దేశం మొత్తానికి తెలుసు. ఈ దేశానికి నాయకుడిగా మీకు కూడా ఈ విషయాలు తెలిసే ఉంటుంది. నేను వినేశ్‌ ఫోగాట్‌. మీ దేశపు ఆడబిడ్డను. ఏడాదికాలంగా నేను పడుతున్న ఆవేదనను తెలియజేయడానికే ఈ లేఖను రాస్తున్నాను. 2016లో సాక్షి ఒలింపిక్‌ మెడల్‌ గెలిచిన రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడే మీ ప్రభుత్వం ఆమెను బేటీ బచావో బేటీ పడావోకు బ్రాండ్‌ అంబాసిడర్‌ను చేసింది. అప్పుడు ఈ దేశపు ఆడబిడ్డగా నేనేంతో సంతోషించాను. ఇటీవలే సాక్షి రెజ్లింగ్‌ నుంచి తప్పుకుంది. మా మహిళా అథ్లెట్లు గవర్నమెంట్ ప్రకటనలల్లో కనిపించడానికే ఉన్నామా? నాకు ఒలింపిక్ పతకం గెలవాలని లక్ష్యం ఉండేది. కానీ ఇప్పుడు అది ఓ కలగానే మిగిలిపోయింది. ఈ ప్రోగ్రాంలో మీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫ్యాన్సీ ప్లెక్సీలు ఫేడ్‌ అవుట్‌ అయ్యాయి. సాక్షి కూడా ఆట నుంచి తప్పుకుంది. మమ్మల్ని అణగదొక్కాలని చూసిన వ్యక్తి ఈ ఆటలో తాను లేకున్నా ఆటను డామినేట్‌ చేస్తానని బహిరంగంగానే చెప్తున్నారు. మీ బిజీ షెడ్యూల్​లో ఓ ఐదు నిమిషాలైన వెచ్చించి ఆ వ్యక్తి (బ్రిజ్‌ భూషణ్‌ను ఉద్దేశిస్తూ) ఏం చెప్తున్నారో వినండి. అప్పుడు ఆయన ఏం చేశారో మీకు తెలుస్తుంది. మమ్మల్ని అణగదొక్కడానికి ఆయన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఆయన కారణంగానే చాలా మంది మహిళా రెజ్లర్లు ఈ ఆట నుంచి వెనుకడుగువేశారు.." అని ఆ రెండు పేజీల లేఖలో వినేశ్​ తన ఆవేదనను ప్రధానికి చెప్పుకుంది.

  • मैं अपना मेजर ध्यानचंद खेल रत्न और अर्जुन अवार्ड वापस कर रही हूँ।

    इस हालत में पहुँचाने के लिए ताकतवर का बहुत बहुत धन्यवाद 🙏 pic.twitter.com/KlhJzDPu9D

    — Vinesh Phogat (@Phogat_Vinesh) December 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరోవైపు ఇప్పటికే ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పునియాతో పాటు డెఫిలంపిక్స్ ఛాంపియన్ వీరేంద్ర సింగ్ యాదవ్ పద్మశ్రీ అవార్డులను తిరిగి ఇచ్చేసిన కొద్ది రోజుల తర్వాత వినేశ్​ ఈ నిర్ణయం తీసుకోవడం అటు అథ్లెట్లతో పాటు క్రీడా అభిమానులను షాక్​కు గురి చేస్తోంది.

'బ్రిజ్ భూషణ్ అనుచరుల పాలనలో పోటీ చేయలేను'- సాక్షి మాలిక్ రిటైర్మెంట్'

WFI Elections : WFIకు షాక్​.. సభ్యత్వం రద్దు.. ఇకపై భారత రెజ్లర్లు అలా ఆడలేరు..

Last Updated : Dec 26, 2023, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.