ETV Bharat / sports

అవార్డులను తిరిగిచ్చిన వినేశ్​ - కర్తవ్య పథ్​పై వదిలిపెట్టి నిరసన! - రెజ్లింగ్ సమాఖ్య వివాదం

Vinesh Phogat Arjuna Award : తనకొచ్చిన అర్జున, ఖేల్ రత్న అవార్డులను స్టార్ రెజ్లర్ వినేశ్​ ఫొగట్ తిరిగి ఇచ్చేసింది. ఈ మేరకు వాటిని దిల్లీలోని ​కర్తవ్య పథ్ పేవ్‌మెంట్‌పై వదిలిపెట్టింది.

Vinesh Phogat Arjuna Award
Vinesh Phogat Arjuna Award
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 7:50 PM IST

Updated : Dec 31, 2023, 6:22 AM IST

Vinesh Phogat Arjuna Award : భారత స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ తనకు వచ్చిన జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజగా ఆమె ఆ అవార్డులను తిరిగి ఇచ్చేసింది. దిల్లీలోని కర్తవ్య పథ్ పేవ్‌మెంట్‌పై శనివారం తన అర్జున, ఖేల్ రత్న అవార్డులను ఆమె వదిలిపెట్టి వచ్చింది. అయితే తొలుత ఆమె ప్రధాన మంత్రి కార్యాలయం ఎదుట వదిలేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమెను కర్తవ్య పథ్ వద్ద పోలీసులు అడ్డగించారు. దీంతో తన అవార్డులను కర్తవ్య పథ్ వద్ద పేవ్‌మెంట్‌పై వదిలేసింది.

  • यह दिन किसी खिलाड़ी के जीवन में न आए। देश की महिला पहलवान सबसे बुरे दौर से गुज़र रही हैं। #vineshphogat pic.twitter.com/bT3pQngUuI

    — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) December 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇటీవలే ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన ఓ లేఖలో తన అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు పేర్కొంది. "నేను నా మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న, అలాగే అర్జున అవార్డును తిరిగి ఇస్తున్నాను" అంటూ క్యాప్షన్​ను జోడించింది. రెండు పేజీల లేఖలో వినేశ్​ తన ఆవేదనను ప్రధానికి చెప్పుకుంది.

"గౌరవనీయులైన ప్రధాన మంత్రికి,

సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌ నుంచి తప్పుకుంది. బజరంగ్‌ పునియా కూడా తన పద్మశ్రీని తిరిగిచ్చేశాడు. ఇందుకు గల కారణాలు ఏంటో దేశం మొత్తానికి తెలుసు. ఈ దేశానికి నాయకుడిగా మీకు కూడా ఈ విషయాలు తెలిసే ఉంటుంది. నేను వినేశ్‌ ఫోగాట్‌. మీ దేశపు ఆడబిడ్డను. ఏడాదికాలంగా నేను పడుతున్న ఆవేదనను తెలియజేయడానికే ఈ లేఖను రాస్తున్నాను. 2016లో సాక్షి ఒలింపిక్‌ మెడల్‌ గెలిచిన రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడే మీ ప్రభుత్వం ఆమెను బేటీ బచావో బేటీ పడావోకు బ్రాండ్‌ అంబాసిడర్‌ను చేసింది. అప్పుడు ఈ దేశపు ఆడబిడ్డగా నేనేంతో సంతోషించాను. ఇటీవలే సాక్షి రెజ్లింగ్‌ నుంచి తప్పుకుంది. మా మహిళా అథ్లెట్లు గవర్నమెంట్ ప్రకటనలల్లో కనిపించడానికే ఉన్నామా? నాకు ఒలింపిక్ పతకం గెలవాలని లక్ష్యం ఉండేది. కానీ ఇప్పుడు అది ఓ కలగానే మిగిలిపోయింది. ఈ ప్రోగ్రాంలో మీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫ్యాన్సీ ప్లెక్సీలు ఫేడ్‌ అవుట్‌ అయ్యాయి. సాక్షి కూడా ఆట నుంచి తప్పుకుంది. మమ్మల్ని అణగదొక్కాలని చూసిన వ్యక్తి ఈ ఆటలో తాను లేకున్నా ఆటను డామినేట్‌ చేస్తానని బహిరంగంగానే చెప్తున్నారు. మీ బిజీ షెడ్యూల్​లో ఓ ఐదు నిమిషాలైన వెచ్చించి ఆ వ్యక్తి (బ్రిజ్‌ భూషణ్‌ను ఉద్దేశిస్తూ) ఏం చెప్తున్నారో వినండి. అప్పుడు ఆయన ఏం చేశారో మీకు తెలుస్తుంది. మమ్మల్ని అణగదొక్కడానికి ఆయన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఆయన కారణంగానే చాలా మంది మహిళా రెజ్లర్లు ఈ ఆట నుంచి వెనుకడుగువేశారు.." అంటూ తన బాధను చెప్పుకుంది.

  • मैं अपना मेजर ध्यानचंद खेल रत्न और अर्जुन अवार्ड वापस कर रही हूँ।

    इस हालत में पहुँचाने के लिए ताकतवर का बहुत बहुत धन्यवाद 🙏 pic.twitter.com/KlhJzDPu9D

    — Vinesh Phogat (@Phogat_Vinesh) December 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వినేశ్ ఫొగాట్​, బజరంగ్​ పునియాకు ట్రయల్స్ నుంచి మినహాయింపు.. ఎందుకో తెలుసా?

Vinesh Phogat Asian Games : ఆసియా గేమ్స్​ నుంచి వినేశ్ ఫొగాట్​ ఔట్

Last Updated : Dec 31, 2023, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.