ETV Bharat / sports

ఒలింపిక్స్​ వాయిదాతో పెరిగిన భారం.. ఎంతంటే? - టోక్యో ఒలింపిక్స్​కు అయ్యే అదనపు భారం.

ఒలింపిక్స్​ను ఏడాది వాయిదా వేయడం వల్ల భారం భారీగా పెరిగింది. ఈ విషయాన్ని శుక్రవారం సమావేశం జరిగిన అనంతరం నిర్వహక కమిటీ వెల్లడించింది. వచ్చే ఏడాది జులై 23 నుంచి టోక్యో ఒలింపిక్స్ జరగనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

Tokyo Olympics delay costs may reach USD 2.8 billion
టోక్యో ఒలింపిక్స్​ వాయిదా భారం ఎంతంటే!
author img

By

Published : Dec 4, 2020, 7:36 PM IST

టోక్యో ఒలింపిక్స్​ను వచ్చే ఏడాదికి వాయిదా వేయడం వల్ల రూ.20 వేల కోట్ల మేర ఖర్చు పెరిగే అవకాశం ఉందని నిర్వాహక కమిటీ తెలిపింది. శుక్రవారం జరిగిన సమావేశంలో టోక్యో సిటీ, జపాన్​ ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఒలింపిక్​ నిర్వాహక కమిటీ ఖర్చుల అంచనాను ప్రకటించింది.

ఖర్చులో వాటా

ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్​ కరోనా ప్రభావంతో.. వచ్చే జులై 23న జరపనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో టోర్నీ నిర్వహణకు అయ్యే ఖర్చుతో పాటు ఇతర అంశాల గురించి శుక్రవారం జరిగిన సమావేశంలో చర్చించారు. అదనపు ఖర్చుల్లో మూడింట రెండొంతులను ఇరు ప్రభుత్వ సంస్థలు భరించనున్నాయి. మిగిలిన ఒక వంతు ఖర్చుకు ప్రైవేట్​ నిధుల ఆర్గనైజింగ్​ కమిటీ బాధ్యత వహిస్తుంది.

ఒలింపిక్స్​ ఆలస్యం కారణంగా 171 బిలియన్​ యెన్లు అంటే దాదాపుగా రూ.12 వేల కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ ఖర్చులను నిర్వాహక కమిటీతో పాటు టోక్యో ప్రభుత్వం సమంగా భరించనుండగా.. జపాన్​ ప్రభుత్వం కొంత మొత్తంలో సాయం చేయనుంది.

అంచనాను మించిన ఖర్చు

2013లో ఒలింపిక్స్​ నిర్వహణ వేలంలో జపాన్​ గెలిచినప్పుడు రూ. 53 వేల కోట్ల ఖర్చవుతుందని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. టోక్యో ఒలింపిక్స్​ వాయిదా వేయడానికి ముందు అప్పటికే రూ.90 వేల కోట్లను ఖర్చు పెట్టినట్లు వెల్లడించింది. కానీ, గతేడాది జపాన్​ ప్రభుత్వం లెక్కల్లో అనుకున్న దాని కంటే రెండింతలు ఎక్కువ ఖర్చు అయినట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితం ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో ఈసారి జరగబోయే మెగా క్రీడలు అత్యంత ఖరీదైన వేసవి ఒలింపిక్స్​ అని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.