ETV Bharat / sports

'సుమో' యోధుడికి కరోనా పాజిటివ్ - సుమో యోధుడికీ కరోనా!

జపాన్​కు చెందిన సుమో యోధుడు హకుహో కరోనా బారినపడ్డాడు. ఈ విషయాన్ని జపాన్ సుమో అసోసియేషన్ నేడు ప్రకటించింది.

Sumo Grand Champion Hakuho tests positive for COVID-19
సుమో యోధుడికి కరోనా పాజిటివ్
author img

By

Published : Jan 5, 2021, 4:30 PM IST

జపాన్‌కు చెందిన ప్రాచీన మల్లయుద్ధ కళ సుమో. ఇది ఆ దేశ జాతీయ క్రీడ కూడా.ఈ విధానంలో పోరాడే వారిని రికిషి యోధులంటారు. భారీ కాయానికి మారుపేరైన మహా యోధుల మధ్య జరిగే పోరాటాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులున్నారు. కాగా, తొలిసారిగా ఓ సుమో యోధుడికి కరోనా వైరస్‌ సోకినట్టు జపాన్‌ సుమో అసోసియేషన్‌ నేడు ప్రకటించింది.

సుమో యోధుడికి కరోనా పాజిటివ్

సుమో యోధులు అత్యంత నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతారు. వీరి దినచర్య శిక్షణ, అభ్యాసం, కఠిన నియమ నిబంధనలతో కూడి ఉంటుంది. వీరికి కారు నడపటం నిషిద్దం. చలి కాలంలో కూడా వీరు యుకాటా అనే పలుచని కాటన్‌ వస్త్రాన్ని మాత్రమే నడుము చుట్టూ ధరించాల్సి ఉంటుంది. ఐతే ఇంత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ.. ఎన్నో పోటీల్లో గణనీయమైన విజయాలు సాధించిన హకుహో అనే ఓ సుమో యోధుడికి వాసన తెలియకపోవటం తదితర లక్షణాలు కనపడ్డాయట. ఈ క్రమంలో చేసిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

పన్నెండున్నర కోట్ల జనాభా ఉన్న జపాన్‌లో ఇప్పటి వరకు కేవలం మూడువేల ఐదువందల కొవిడ్‌-19 మరణాలు నమోదయ్యాయి. దీనితో ఆ దేశం కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా కట్టడి చేసిందనే చెప్పాలి. ఐతే ఇటీవల కొద్ది వారాల నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ రావటం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.