ETV Bharat / sports

'పోటీల్లో రాణిస్తాం.. ఒలింపిక్స్​కు అర్హత సాధిస్తాం'

author img

By

Published : Apr 20, 2021, 6:40 AM IST

భారత మహిళల 4x100 మీటర్ల రిలే జట్టు ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధిస్తుందని స్టార్​ స్ప్రింటర్​ హిమదాస్​ తెలిపింది. వచ్చే నెల పొలెండ్​లో జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్​ రిలేలో రాణించి టోక్యో బెర్త్​ సాధిస్తామని ఆ బృందంలో ఒకరైన హిమ పేర్కొంది.

sprinter himadas, indian women relay team
భారత స్టార్ స్ప్రింటర్ హిమదాస్, భారత మహిళల రిలే జట్టు ఒలింపిక్స్​కు అర్హత సాధిస్తుంది

ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్​కు భారత మహిళల 4x100మీ. రిలే జట్టు అర్హత సాధిస్తుందని ఆ బృందంలో ఒకరైన స్టార్ స్ప్రింటర్ హిమదాస్ ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చే నెలలో పొలెండ్​లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ రిలేలో రాణించి టోక్యో బెర్త్ సాధిస్తామని చెప్పింది. వచ్చే నెల 1న ఆరంభమయ్యే ఆ పోటీల్లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచే జట్లు ఒలింపిక్స్​కు అర్హత సాధిస్తాయి. భారత మహిళల 4x100మీ. రిలే జట్టులో హిమతో పాటు ద్యుతిచంద్, అర్చన, ధనలక్ష్మీ, హిమశ్రీ, ధనేశ్వరి ఉన్నారు.

"ద్యుతి కూడా జట్టులో ఉంది. ప్రపంచ రిలే ఛాంపియన్​షిప్ లో మెరుగైన ప్రదర్శనతో ఒలింపిక్స్​కు అర్హత సాధిస్తామనే నమ్మకంతో ఉన్నా. మేం అది సాధించాలి. నేను మంచి లయతో ఉన్నా. మిగతా అథ్లెట్లు కూడా మంచిగా సన్నద్ధమవుతున్నారు. ఫెడరేషన్ కప్​లో వ్యక్తిగతంగా మేం రాణించాం" అని ఆమె చెప్పింది. శిక్షణ కోసం టర్కీ వెళ్లనున్న తను.. అక్కడ 100మీ, 200మీ. పరుగుపైనే పూర్తి దృష్టి పెడతానని చెప్పింది.

ఇదీ చదవండి: ఛేదనలో తేలిపోయిన రాజస్థాన్​.. చెన్నైదే గెలుపు

400మీ. పరుగులో ప్రపంచ జూనియర్ ఛాంపియన్​గా నిలవడమే కాకుండా 2018 ఆసియా క్రీడల్లో రజతం గెలిచిన ఆమె ఆ తర్వాత వెన్నెముక గాయం కారణంగా ఆ విభాగంలో పోటీపడట్లేదు. "టర్కీలో శిక్షణలో భాగంగా 100మీ, 200మీ. పరుగులోనే సాధన చేస్తా. ఒలింపిక్స్ అర్హత టోర్నీల్లో పాల్గొంటా. 400 మీటర్ల పరుగులో పోటీపడే అంశం నా చేతుల్లో లేదు" అని ఆమె పేర్కొంది.

ఇదీ చదవండి: దిల్లీ X ముంబయి: మూడో గెలుపు ఎవరిదో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.