ETV Bharat / sports

దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాలు

author img

By

Published : Jun 19, 2020, 6:11 PM IST

భారత్​లో 1000 ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. క్రీడల్లో మనదేశాన్ని సూపర్​పవర్​గా మార్చడంలో భాగంగానే వీటిని ప్రారంభించబోతున్నట్లు కేంద్రక్రీడా మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.

Sports Ministry to establish 1000 district-level Khelo India Centres
దేశంలో వేయి ఖేలో ఇండియా కేంద్రాలను త్వరలో ఏర్పాటు

దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ. జిల్లా స్థాయిలోని క్రీడాకారులకు శిక్షణను అందించడమే లక్ష్యంగా వీటిని నెలకొల్పతున్నట్లు క్రీడామంత్రి కిరణ్​ రిజిజు చెప్పారు. ఆటగాళ్లకు, వారికి శిక్షణ ఇచ్చే నిపుణులకు తగిన పారితోషికం అందించనున్నారు. ఈ కేంద్రాల్లో మాజీ ఛాంపియన్లను కోచ్​లుగా నియమించి పర్యవేక్షించనున్నారు.

Sports Ministry to establish 1000 district-level Khelo India Centres
జాతీయ క్రీడా సమాఖ్యలు

"క్రీడల్లో భారత్​ను సూపర్​పవర్​గా మార్చేందుకు, క్రీడలను యువత కెరీర్​గా ఎంచుకునే విధంగా చర్యలు చేపట్టాలి. ఆటగాళ్లకు నిరంతర జీవనోపాధిని అందించగలిగినప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను దీనిని కెరీర్​గా​ ఎంచుకునేలా ప్రోత్సాహిస్తారు. వారిలో ఉత్తమ ప్రతిభను వెతకేందుకు ఉన్న దారి ఇదే. లేకపోతే ఇంకో రంగాన్ని​ ఎంచుకునే అవకాశం ఉంటుంది"

- కిరణ్​ రిజిజు, కేంద్ర క్రీడా మంత్రి

ఈ కొత్త విధానంతో మాజీ ఛాంపియన్లు స్వతహాగా అకాడమీలు ఏర్పాటు చేసుకోవడం సహా ఖేలో ఇండియా కేంద్రాల్లో విధులు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ కేంద్రాలను నడపడంలో భాగంగా, అథ్లెట్ల ప్రతిభను బట్టి నాలుగు విభాగాలుగా విభజించారు.

కేటగిరీ 1: అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లు.

కేటగిరీ 2: ఖేలో ఇండియా లేదా జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు.

కేటగిరీ 3: యూనివర్సిటీ స్థాయి పోటీల్లో పతకాలను సాధించిన మాజీ ఛాంపియన్లు.

కేటగిరీ 4: రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్లు నిలిచిన వారు.

స్టేడియం

ఖేలో ఇండియా కేంద్రాల్లో మొత్తం 14 ఆటలకు సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. ఈ జాబితాలో ఆర్చరీ, అథ్లెటిక్స్​, బాక్సింగ్​, బ్యాడ్మింటన్​, సైక్లింగ్​, ఫెన్సింగ్​, హాకీ, జూడో, రోయింగ్​, షూటింగ్​, స్విమ్మింగ్​, టేబుల్​ టెన్నిస్​, వెయిట్​ లిఫ్టింగ్​, రెజ్లింగ్​లు ఉన్నాయి. వీటితో పాటు ఫుట్​బాల్​, సంప్రదాయ క్రీడలను ఇందులో చేర్చారు. ఈ కేంద్రాలను పర్యవేక్షించే కోచ్​లకు, పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లకు పారితోషికం ఇవ్వడం సహా వారికి కావాల్సిన క్రీడాసామాగ్రిని అందిచనున్నారు.

ఇదీ చూడండి... 'అందుకే భారత్​ చేతిలో పాక్​ మళ్లీ ఓడింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.