దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన ఆటగాళ్ల పేర్లను.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏఐ)లోని క్రీడా సౌకర్యాలకు పెట్టనున్నట్లు క్రీడామంత్రిత్వ శాఖ వెల్లడించింది. తద్వారా భారత్లోని క్రీడా వీరులను గౌరవించినట్లవుతుందని పేర్కొంది.
మొదటి దశలో భాగంగా.. లఖ్నవూ, భోపాల్, సోనేపట్లలో ఉన్న నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(ఎన్సీఓఈ)లలో నిర్మిస్తున్న పలు కట్టడాలతో పాటు.. గుహవాటిలో నిర్మించనున్న సాయ్ శిక్షణ కేంద్రానికి అక్కడి స్థానిక ఆటగాళ్ల పేర్లను పెట్టనున్నారు. అందుకు అర్హులైన ఆటగాళ్ల పేర్లను మాత్రం మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు.
''దేశంలో క్రీడా సంస్కృతిని విస్తరించాలంటే అందుకు అర్హులైన ఆటగాళ్లను గౌరవించడం చాలా ముఖ్యం. అప్పుడే యువతరం ఆటలను వృత్తిగా చేపట్టడానికి ముందుకొస్తారు.''
-కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి.
ఇదీ చదవండి: గబ్బా టెస్టులో సుందర్, ఠాకూర్ రికార్డు భాగస్వామ్యం