2020 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా అవార్డుల (2020 National Sports Awards) విజేతలకు సోమవారం ట్రోఫీలను స్వయంగా బహుకరించారు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. కరోనా కారణంగా గతేడాది ఈ అవార్డుల ప్రదానోత్సవం వర్చువల్గా జరిగింది.
విజేతలందరికీ ఇదివరకే నగదు బహుమానం అందింది. కానీ, మహమ్మారి కారణంగా ట్రోఫీలు, ప్రశంసాపత్రాలను అందుకోలేకపోయారు. గతేడాది ఆగస్టు 29న 5 ఖేల్రత్న సహా 74 జాతీయ క్రీడా అవార్డులను (Sports Awards In India 2020) ప్రదానం చేసింది క్రీడల శాఖ.
ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్, 2016 పారాలింపిక్స్ పసిడి విజేత తంగవేలు మరియప్పన్ ఉన్నారు. వారికి ఖేల్రత్న (Khel Ratna Award 2020) లభించింది.
టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా, క్రికెటర్ ఇషాంత్ శర్మ, స్ప్రింటర్ ద్యుతి చంద్, ఆర్చర్ అతాను దాస్, షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అర్జున (Arjuna Award 2020) ట్రోఫీలను అందుకున్నారు.
ఇదీ చూడండి: జాతీయ క్రీడా అవార్డులు ఏంటి? ఎలా ఎంపిక చేస్తారు?