దిల్లీలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇద్దరు షూటర్లకు వైరస్ సోకినట్లు ఆదివారం నిర్ధరణ అయింది. ప్రస్తుతం వారిని ఆస్పత్రికి తరలించినట్లు జాతీయ రైఫిల్ అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు. వారు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగానికి చెందిన వారు.
అంతకు ముందు శనివారం చేసిన పరీక్షల్లో ఇద్దరు భారత షూటర్లతో పాటు ఓ అంతర్జాతీయ షూటర్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వారంతా స్వీయ నిర్భంధంలో ఉన్నారు.
పోటీల మొదలైన రెండోరోజు యశస్విని సింగ్ దీస్వాల్.. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. మను బాకర్ రజతం గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో సౌరభ్ చౌదరి, అభిషేక్ శర్మ.. వరుసగా వెండి, కంచు పతకాలు కైవసం చేసుకున్నారు.