ETV Bharat / sports

టెన్నిస్​ దిగ్గజం సంచలన ప్రకటన.. రిటైర్మెంట్​ అంటూ! - సెరెనా దిగ్గజం

serena williams retirement says she is ''evolving away from tennis''

author img

By

Published : Aug 9, 2022, 7:53 PM IST

Updated : Aug 9, 2022, 8:09 PM IST

19:41 August 09

టెన్నిస్​ దిగ్గజం సంచలన ప్రకటన.. రిటైర్మెంట్​ అంటూ!

serena williams retirement
సెరెనా విలియమ్స్​

Serena Williams Retirement: అమెరికా టెన్నిస్​ దిగ్గజం సెరెనా విలియమ్స్​ రిటైర్మెెంట్​ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. టెన్నిస్​కు మెల్లమెల్లగా దూరమవుతున్నట్లు ప్రకటించింది. 23 గ్రాండ్​స్లామ్​ టైటిళ్లు సాధించానని, టెన్నిస్​ నుంచి తప్పుకోవడానికి సిద్ధమేనని ఆమె రాసిన ఓ వ్యాసాన్ని వోగ్​ మ్యాగజైన్​ విడుదల చేసింది. ఈ సందర్భంగా రిటైర్మెంట్​ అనే పదం తనకు ఇష్టం లేదని.. టెన్నిస్​కు దూరంగా ఉంటూ తనకిష్టమైన ఇతర విషయాల పట్ల దృష్టి సారిస్తానని ఆమె చెప్పింది. మరో బిడ్డ, ఇతర వ్యాపారాలు చూసుకుంటానని వివరించింది.

''నాకు ఈ సెప్టెంబర్​లో 41 ఏళ్లు వస్తాయి. ఇంకా ఏదో ఇవ్వాలి.'' అని సెరెనా పేర్కొంది. విలియమ్స్​ ప్రస్తుతం సుదీర్ఘ విరామం తర్వాత.. టోరంటో నేషనల్​ బ్యాంక్​ ఓపెన్​లో ఆడుతోంది. ఆ తర్వాత సీజన్​ చివరి గ్రాండ్​ స్లామ్​ యూఎస్​ ఓపెన్​లో ఆడనుంది. ఆగస్టు 29న న్యూయార్క్​లో ఈ ఈవెంట్​ ప్రారంభం కానుంది. బహుశా తన సొంత దేశంలోనే సెరెనా తన చివరి మ్యాచ్​ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత ప్రొఫెషనల్(ఓపెన్​ ఎరా)​ శకంలో అత్యధిక గ్రాండ్​స్లామ్​ టైటిళ్లు గెలిచింది సెరెనా విలియమ్స్​. ఈ ఘనత మరే టెన్నిస్​ క్రీడాకారుడికి కూడా సాధ్యం కాలేదు. రికార్డు స్థాయిలో 23 గ్రాండ్​స్లామ్​లు సొంతం చేసుకుంది అమెరికా నల్లకలువ. ఆల్​టైమ్​ అత్యధిక గ్రాండ్​స్లామ్​ టైటిళ్లు సాధించిన రికార్డు మార్గరెట్​ కోర్ట్​(ఆస్ట్రేలియా) పేరిట ఉంది. ఆమె మొత్తం 24 టైటిళ్లు గెల్చుకుంది. పురుషుల సింగిల్స్​లో స్పెయిన్​ బుల్​ రఫెల్​ నాదల్​ 22 గ్రాండ్​స్లామ్​ టైటిళ్లతో ముందుండగా.. సెర్బియా స్టార్​ నొవాక్​ జకోవిచ్​(21), స్విస్​ దిగ్గజం రోజర్​ ఫెదరర్​(20) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

Last Updated : Aug 9, 2022, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.