ETV Bharat / sports

'ఖేల్​రత్న', 'అర్జున' కోసం ఎలా ఎంపిక చేస్తారంటే? - arjuna awards

ఈ ఏడాది ఇవ్వబోయే భారత అత్యున్నత క్రీడా పురస్కారాలు ఖేల్​రత్న, అర్జునలను త్వరలో ప్రదానం చేయనున్నారు. అయితే వాటి ఎంపిక కోసం ప్రమాణాలేంటి? క్రీడాకారులకు ఏం అర్హతలు ఉండాలి?

Selection criteria for the National Sports Awards
జాతీయ క్రీడా పురస్కారాలు
author img

By

Published : Aug 22, 2020, 4:11 PM IST

ఏటా ప్రతిష్టాత్మకంగా జరిగే జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం.. కరోనా ప్రభావంతో ఈసారి వర్చువల్​ పద్ధతిలో నిర్వహించనున్నారు. అవార్డు గ్రహీతలు వారి స్వస్థలాల నుంచే ఆన్​లైన్​ ద్వారా కార్యక్రమంలో పాల్గొనున్నారు.

స్టార్​ క్రికెటర్​ రోహిత్​ శర్మను రాజీవ్​ గాంధీ ఖేల్​ రత్న అవార్డు వరించింది. ఇతడితో పాటే పారా అథ్లెట్​ మరియప్పన్​ తంగవేలు, టేబుల్​ టెన్నిస్​ ఛాంపియన్​ మనిక బత్రా, రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​, మహిళల హాకీ జట్టు కెప్టెన్​ రాణి రాంపాల్​ ఈ జాబితాలో ఉన్నారు. మరో 27 మంది అర్జున అవార్డును అందుకోనున్నారు. ద్రోణాచార్య అవార్డుకు 13 మంది కోచ్​ల పేర్లను సిఫార్సు చేశారు.

Selection criteria for the National Sports Awards
ఖేల్​ రత్న, అర్జున అవార్డులు సాధించిన క్రీడాకారులు

ఖేల్​రత్న గ్రహీతలకు ప్రస్తుతం రూ.7.5 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నారు. అర్డున, ద్రోణాచార్య పురస్కార గ్రహీతలకు రూ.5 లక్షల చొప్పన లభిస్తాయి. ఈ సారి మాత్రం నగదు బహుమతిని భారీగా పెంచాలని క్రీడా మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపితే.. ఖేల్​రత్న గ్రహీతలకు రూ.25 లక్షలు, అర్జున అవార్డు విజేతలకు రూ.15 లక్షలు ఇవ్వనున్నరు. ఈ క్రమంలోనే అసలు ఈ అవార్డుల ఇచ్చేందుకు క్రీడాకారులను ఎలా ఎంపిక చేస్తారు? ఏ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుంటారు?

రాజీవ్​ గాంధీ ఖేల్​ రత్న అవార్డు

నిబంధనల ప్రకారం.. ఒలింపిక్​, పారా ఒలింపిక్​ పతక విజేతలు నేరుగా ఖేల్​ రత్న అవార్డు నామినేషన్​కు అర్హత సాధిస్తారు. వీరు కాకుండా, ఇతర క్రీకాడాకులకు ప్రపంచ ఛాంపియన్​షిప్​ పాయింట్ల లెక్కింపు/ప్రపంచకప్​లు(నాలుగేళ్లకు ఒకసారి)- బంగారు పతకం(40 పాయింట్లు), రజతం(30), కాంస్య పతకం(20) చొప్పున అర్హతలుగా పరిగణిస్తారు. ఆసియా క్రీడల్లో 30, 25, 20 పాయింట్లు.. కామన్​వెల్త్​ గేమ్స్​, ప్రపంచ ఛాంపియన్​షిప్​, ప్రపంచ కప్​(వార్షిక)ల్లో 25, 20, 15 పాయింట్లు కలిగి ఉండాలి. ఆసియా ఛాంపియన్​షిప్​ అండ్​ కామన్వెల్త్ గేమ్స్​లో 15, 10, 7 పాయింట్లు పొందిన వారినీ పరిగణలోకి తీసుకుంటారు.

అర్జున అవార్డు

భారత ప్రభుత్వం 1961లో అర్జున అవార్డును క్రీడాకారులకు ఇవ్వడం ప్రారంభించింది. ఈ పురస్కార గ్రహీతలకు నగదు బహుమతితో పాటు అర్డునుడి కాంస్య విగ్రహం, పతకం​ అందజేస్తారు. ఇటీవలే క్రీడా మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించింది. గతంలో నాలుగేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా ప్రదర్శిస్తున్న క్రీడాకారులు ఈ అవార్డుకు అర్హులుగా పేర్కొంది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. క్రీడా నైపుణ్యంతో పాటు, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ కూడా కలిగి ఉండాలని సూచించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.