ETV Bharat / sports

'టోక్యో ఒలింపిక్స్​ రద్దు ఆలోచనే లేదు'

టోక్యో ఒలింపిక్స్​ రద్దు ఆలోచన లేదని నిర్వాహక కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమోటో స్పష్టం చేశారు. ఒలింపిక్స్​ను రద్దు చేసే అంశం పరిశీలనలో ఉందని జపాన్​ అధికార పార్టీ జనరల్​ కార్యదర్శి క్రితం రోజు వ్యాఖ్యానించారు.

Seiko Hashimoto, chair of the organizing committee, Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్​ 2020, నిర్వాహక కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమోటో
author img

By

Published : Apr 17, 2021, 8:57 AM IST

కరోనా మహమ్మారి పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై రోజుకో మాట వినిపిస్తోంది. ఒలింపిక్స్​ రద్దు చేసే అంశం పరిశీలనలో ఉందని జపాన్ అధికార పార్టీ ఎల్డీపీ జనరల్​ కార్యదర్శి తొహిషిరో వ్యాఖ్యానించి రోజైనా గడవకముందే.. ఆ మెగా క్రీడలను రద్దు చేసే అవకాశమే లేదని నిర్వాహక కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమోటో తేల్చి చెప్పింది.

ఇదీ చదవండి: 'ఛలో ఛలో' పాట ధోనీకి అంకితం: రెహమాన్​

"ఒలింపిక్స్​ నిర్వహణ దిశగా విభిన్నమైన సవాళ్లు ఉన్నాయి. కానీ ఆ మెగా క్రీడలను రద్దు చేసే ఆలోచనలో టోక్యో 2020 నిర్వాహక కమిటీకి లేదు. ఒలింపిక్స్​ వేదికలు, పాటించాల్సిన నిబంధనల గురించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం" అని హషిమోటో వెల్లడించింది. మరోవైపు ఆ దేశ ప్రధాని సుగా కూడా ఒలింపిక్స్​ను పూర్తి ఆరోగ్యకర వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఒలింపిక్స్​ ఈ జులై 23న ఆరంభం కానున్నాయి.

ఇదీ చదవండి: ప్రభాస్‌ జాబితాలో మరో సినిమా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.