ETV Bharat / sports

క్రీడా పురస్కారాల ఎంపిక కమిటీలో సెహ్వాగ్​, సర్దార్​ - వీరేంద్ర సెహ్వాగ్​

జాతీయ క్రీడా పురస్కారాల విజేతలను ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీలో సెహ్వాగ్, సర్దార్ సింగ్ చోటు దక్కించుకున్నారు. ఆగస్టు 29న ధ్యాన్​చంద్ జయంతి(జాతీయ క్రీడా దినోత్సం) సందర్భంగా గ్రహీతల పేర్లు ప్రకటిస్తారు.

Sehwag, Sardar in12-member selection panel for National Sports Awards
క్రీడా పురస్కారాల కమిటీలో సెహ్వాగ్​, సర్దార్​లకు చోటు
author img

By

Published : Jul 31, 2020, 9:15 PM IST

ఈ ఏడాది జాతీయ క్రీడా అవార్డుల విజేతలను ఎంపిక చేసేందుకు 12 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ. ఇందులో భారత మాజీ క్రికెటర్​ వీరేందర్ సెహ్వాగ్​, హాకీ స్టార్​ సర్దార్​ సింగ్​లు ఉన్నారు. గత సంవత్సరంలానే అథ్లెట్లు, కోచ్​ల రెండు విభాగాల్లో అవార్డు గ్రహీతలను ఎంపిక చేయనున్నారు. ఈ బృందానికి రిటైర్డ్​ సుప్రీంకోర్టు జస్టిస్​ ముకుందం శర్మ నేతృత్వం వహిస్తారు. ఈ ప్యానల్​లో పారాలింపిక్​ రజత పతక విజేత దీపా మాలిక్​ ఉన్నారు.

"ఈ ఏడాదీ అన్ని అవార్డులకు ఒకే సెలక్షన్​ కమిటీ నియామకాన్ని కొనసాగిస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ కమిటీల వల్ల పరిణామాలు కష్టం కావడం సహా వివాదాలు వస్తున్నాయి" అని క్రీడా మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. కోచ్​లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన ఇద్దరు అదనపు సభ్యులను ఛైర్​పర్సన్​గా ఆహ్వానించవచ్చని.. ద్రోణాచార్య నామినేషన్లనూ పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.

కమిటీలో ఎవరు?

ఈ కమిటీలోని ఇతర సభ్యుల్లో టేబుల్​ టెన్నిస్​ మాజీ క్రీడాకారిణి మొనాలిసా బారుహ్​ మెహతా, బాక్సర్​ వెంకటేశన్​ దేవరాజన్​, క్రీడా వ్యాఖ్యాత మనీశ్​ బటావియా, జర్నలిస్టులు అలోక్​ సిన్హా, నీరూ భాటియాలు ఉన్నారు. స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా డైరెక్టర్​ జనరల్​ సందీప్​ ప్రదాన్, జాయింట్​ సెక్రటరీ (స్పోర్ట్స్​ డెవలప్​మెంట్) ఎల్​ ఎస్​ సింగ్​, టార్గెట్​ ఒలింపిక్​ పోడియం స్కీమ్​ (టాప్స్​) సీఈఓ రాజేశ్​ రాజగోపాలన్​తో సహా ఈ ప్యానెల్​లో క్రీడా మంత్రిత్వశాఖ ప్రాతినిధ్యం వహించనుంది.

ఆలస్యంగా ప్రదానోత్సవం

ఆగస్టు 29న హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్​ జయంతి సందర్భంగా ప్రతిఏటా జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది జరగాల్సిన పురస్కారాల ప్రదానోత్సవం రెండు నెలలపాటు ఆలస్యంగా నిర్వహించే అవకాశం ఉంది. కానీ, ఈ విషయంపై ఇంకా అధికార ప్రకటన రాలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.