saurabh chaudhary win gold medal: భారత షూటర్ సౌరభ్ చౌదరి తొలి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఈజిప్ట్‌లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ప్రపంచకప్‌లో మంగళవారం భారత్‌కు బంగారు పతకం అదించాడు. 19 ఏళ్ల సౌరభ్ మెన్స్ 10మీటర్ల పిస్టోల్ విభాగంలో జర్మనీకి చెందిన మైకెల్ స్క్వాల్డ్ పై 16-6 తేడాతో విజయం సాధించాడు. రష్యాకు చెందిన ఆర్టమ్ చెర్నోసోవ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. 10మీటర్ల మెన్స్ విభాగంలో 584 పాయింట్లు సాధించి సెమీఫైనల్‌కు అర్హత పొందిన సౌరభ్ గ్రూప్‌లో మెుదటి స్థానంలో నిలిచాడు.
మరో మ్యాచ్‌లో భారత షూటర్ శ్రేయ అగర్వాల్ సెమీఫైనల్ బెర్త్‌ను తృటిలో కోల్పోయింది. సోమవారం జరిగిన 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో 629.3 పాయింట్లు సాధించిన శ్రేయ 0.01 సెకన్ల తేడాతో ఓడిపోయింది. హంగేరీకి చెందిన ఎస్ట్జర్ మెస్జారోస్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
ఈజిప్ట్‌లో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో 10మీటర్ల ఎయిర్ రైఫిల్, పిస్టోల్ విభాగంలో కొత్త నిబంధనల అమలు చేశారు. దీని వల్ల ఆటగాళ్లు నేరుగా ఫైనల్స్‌కు వెళ్లకుండా మొదటి ఎనిమిది షూటర్లు మాత్రమే సెమీస్‌కు అర్హత సాధిస్తారు. వీరిలో నలుగురు ఒక్కో జట్టుగా విడిపోతారు. గ్రూపులో మొదట రెండు స్థానాలు సాధించిన వాళ్లు ఫైనల్లో ఆడతారు.
ఇదీ చదవండి: రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్! షాక్‌లో ఫ్యాన్స్