ETV Bharat / sports

Sankalp Gupta GM: భారత 71వ గ్రాండ్​మాస్టర్​గా సంకల్ప్​

author img

By

Published : Nov 8, 2021, 3:49 PM IST

చెస్​లో (Chess Grandmaster) భారత్​ నుంచి మరో గ్రాండ్​మాస్టర్​ అవతరించాడు. 18 ఏళ్ల సంకల్ప్ గుప్తా (Sankalp Gupta GM).. జీఎం హోదా దక్కించుకున్నాడు. అతడికి ప్రపంచ మాజీ ఛాంపియన్​ విశ్వనాథ్ ఆనంద్ అభినందనలు తెలిపాడు.

sankalp gupta chess
గ్రాండ్​మాస్టర్

భారత్​లో మరో గ్రాండ్​మాస్టర్​ (Chess Grandmaster) అవతరించాడు. మహారాష్ట్రకు చెందిన 18 ఏళ్ల సంకల్ప్ గుప్తా (Sankalp Gupta GM).. 71వ జీఎంగా రికార్డులకెక్కాడు. సెర్బియాలో జరుగుతున్న జీఎం ఆస్క్​ 3 రౌండ్​ రాబిన్​ ఈవెంట్​లో రెండో స్థానంలో నిలవడం సహా 6.5 పాయింట్ల సాధించి ఈ ఘనత సాధించాడు. మూడు ఈవెంట్లలోనూ అతడి రేటింగ్​ 2599పైనే ఉంది.

గ్రాండ్​మాస్టర్​ టైటిల్ దక్కించుకునేందుకు మూడు జీఎం నార్మ్స్​ను పొందాల్సి ఉంటుంది. దాంతో పాటు 2500 ఎలో పాయింట్లు సాధించాలి. ఈ టోర్నీ​లో 2500 ఎలో రేటింగ్​ మార్క్​ను అందుకున్నాడు సంకల్ప్​.

గ్రాండ్​మాస్టర్ హోదా దక్కించుకున్న సంకల్ప్​కు అభినందనలు తెలిపాడు చెస్​ దిగ్గజం, ప్రపంచ మాజీ ఛాంపియన్ (Viswanathan Anand News) విశ్వనాథ్ ఆనంద్. 100వ జీఎం అవతరించడానికి ఇంకెంత కాలం పడుతుందో అంటూ ట్వీట్ చేశాడు.

ఇదీ చూడండి: చదరంగంలో 'అతిపిన్న' అభిమన్యుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.