ETV Bharat / sports

చివరి వింబుల్డన్​లో సానియా ఓటమి.. మ్యాచ్​లో ధోనీ, గావస్కర్ సందడి

Sania Mirza Wimbledon: భార‌త టెన్నిస్ దిగ్గ‌జం సానియా మీర్జా క‌ల చెదిరింది. ప్ర‌తిష్ఠాత్మ‌క వింబుల్డ‌న్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ ఛాంపియ‌న్ షిప్‌లో మిక్స్​డ్ డబుల్స్​లో విజేత‌గా నిల‌వాల‌న్న ఆమె కోరిక నెర‌వేర‌లేదు. క్రొయేషియాకు చెందిన పావిచ్​తో క‌లిసి సెమీపైన‌ల్‌కు దూసుకెళ్లిన సానియా ఫైన‌ల్ చేరుకోలేక‌పోయింది. బుధ‌వారం అర్ధ‌రాత్రి జ‌రిగిన సెమీఫైన‌ల్లో సానియా- ప‌విచ్ జోడీ పరాజయం పాలైంది.

sania meerza wimbledon semi final
sania meerza wimbledon semi final
author img

By

Published : Jul 7, 2022, 10:07 AM IST

Sania Mirza Wimbledon: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ సెమీఫైనల్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశే ఎదురైంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో క్రోయేషియా భాగస్వామి పావిచ్‌తో కలిసి సెమీఫైనల్లో అడుగుపెట్టిన సానియాకు నీల్(బ్రిటన్), క్రాయెసిక్(అమెరికా) జోడీ చేతిలో ఓటమి ఎదురైంది. బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ కీలక మ్యాచ్​లో సానియా జంట 6-4, 5-7, 4-6తో పరాజయం పాలైంది. దాంతో సానియా కెరీర్ వింబుల్డన్ టైటిల్ లేకుండానే ముగియనుంది.

సానియా ఖాతాలో లేని మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ వింబుల్డన్‌ ఒక్కటే. ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌ అయిన సానియా.. వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇంతకుముందు 2011, 2013, 2015లో ఆమె క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 2022 సీజన్ తర్వాత టెన్నిస్ నుంచి తప్పుకుంటానని సానియా ఇది వరకే ప్రకటించింది.

స్నేహితులతో కలిసి మ్యాచ్​ చూసిన ధోనీ
సానియా-పావిచ్​ జోడీ

2001లో కెరీర్ ప్రారంభించిన సానియా.. మిక్స్‌డ్‌ డబుల్స్ విభాగంలో 2009 ఆస్ట్రేలియా ఓపెన్, 2012 ఫ్రెంచ్ ఓపెన్, 2014 యూఎస్ ఓపెన్ టైటిళ్లు గెలుచుకుంది. 2008, 2014, 2017 ఆస్ట్రేలియా ఓపెన్‌తో పాటు 2016 ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. మహిళల డబుల్స్ విభాగంలో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకుంది. 2011 ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సానియా.. 2015 వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్, 2016 ఆస్ట్రేలియా ఓపెన్‌లో డబుల్స్ టైటిళ్లు గెలిచింది.

స్నేహితులతో కలిసి మ్యాచ్​ చూసిన ధోనీ
స్నేహితులతో కలిసి సానియా మ్యాచ్​ చూసిన ధోనీ
sania meerza wimbledon semi final
మ్యాచ్​ వీక్షిస్తున్న సునీల్​ గావస్కర్​

మ్యాచ్​కు హాజరైన ధోనీ, సునీల్​ గావస్కర్​.. ఈ మ్యాచ్‌కు టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ హాజరయ్యారు. ప్రేక్షకుల మధ్య కూర్చొని సానియాను ప్రోత్సహించారు. ఇక సానియాతో మహేంద్ర సింగ్ ధోనీ మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. గతంతో ఇరు కుటుంబాలు కలిసి దుబాయ్‌కి వెకేషన్‌కు కూడా వెళ్లాయి. ఈ క్రమంలోనే వింబుల్డన్​లో కీలక మ్యాచ్ ఆడుతున్న సానియాను ఎంకరేజ్ చేయడానికి ధోనీ, గావస్కర్​ వచ్చినట్లు టెన్నిస్ వర్గాలు పేర్కొన్నాయి.

ఇవీ చదవండి: 'బజ్‌బాల్‌' అంటే ఏమిటీ? ఆ పేరు ఎలా వచ్చింది?

IND vs ENG T20: ఇక టీ20 సమరం.. హోరాహోరీ తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.