ETV Bharat / sports

2020 రౌండప్: లోకాన్ని విడిచి.. మదిలో నిలిచి! - బల్బీర్​ సింగ్​ మృతి

ఈ ఏడాది మనకు చాలా చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. దివికెగిసిన ఎందరో ప్రముఖ క్రీడాకారులు, మాజీలు.. తమ అభిమానుల్ని శోకసంద్రంలో ముంచారు. ఇంతకీ వారెవరు అనేది ఈ స్టోరీ.

Remembering the sporting legends who passed away in 2020
క్రీడా లోకాన్ని విడిచి.. అభిమానుల మదిలో నిలిచి!
author img

By

Published : Dec 26, 2020, 2:22 PM IST

2020 అంటే కరోనా, లాక్​డౌన్​తో పాటు చాలా సంఘటనలు మనల్ని కుదిపేశాయి. ఎందరో ప్రముఖ క్రీడాకారులు కూడా ఇదే ఏడాది తుదిశ్వాస విడిచి శోకాన్ని మిగిల్చారు. ఇంతకీ వారెవరు? ఎప్పుడు మరణించారు? అనేదే ఈ కథనం.

కోబ్​ బ్రయంట్​ -బాస్కెట్​ బాల్​ ప్లేయర్ (1978-2020)

నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) లెజెండ్ కోబ్ బ్రయంట్.. జనవరి 26న హెలికాఫ్టర్​ ప్రమాదంలో మృతి చెందాడు. కాలిఫోర్నియాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కోబ్​తో పాటు అతని 13 ఏళ్ల కుమార్తె జియాన్నా, మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఐదుసార్లు ఎన్‌బీఏ ఛాంపియన్‌గా నిలిచిన బ్రయంట్.. రెండుసార్లు(2008, 2012) ఒలింపిక్‌ స్వర్ణాన్ని గెల్చుకున్నాడు.

Remembering the sporting legends who passed away in 2020
కోబ్​ బ్రయంట్

బల్బీర్​ సింగ్​ - హాకీ ఆటగాడు (1923-2020)

అనారోగ్య సమస్యలతో భారత హాకీ దిగ్గజం​ బల్బీర్ సింగ్​.. ఈ ఏడాది మే 8న మొహాలీలో చికిత్స పొందుతూ, అదే నెల 25న మరణించారు. ఒలింపిక్స్​ పురుషుల హాకీ ఫైనల్లో అత్యధిక గోల్స్​ చేసిన ఆటగాడిగా బల్బీర్ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. హకీ జట్టు కెప్టెన్​గా మూడు ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు అందుకున్నారు.

బల్బీర్​ సింగ్​

హాకీ దిగ్గజం బల్బీర్​ సింగ్​ సాధించిన ఒలింపిక్స్​ మెడల్స్​

రాజిందర్​ గోయల్​ - క్రికెటర్ (1942-2020)

ఫస్ట్‌క్లాస్‌ స్పిన్నర్‌ రాజిందర్‌ గోయల్‌ (77) జూన్​ 21న మరణించారు. వయసురీత్యా అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందారు. దేశవాళీలో మ్యాచ్‌ రిఫరీగానూ పనిచేశారు. ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ 157 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 750 వికెట్లు తీశారు. ఈ ఫార్మాట్​లో ఎక్కువ వికెట్లు తీసిన ఘనత ఈయనకే సొంతం.

రాజిందర్​ గోయల్​

చేతన్ చౌహాన్​ - క్రికెటర్ (1947-2020)

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ అనారోగ్య సమస్యలతో ఆగస్టు 16న​ కన్నుమూశారు. కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరిన చేతన్​​.. వైరస్​ నుంచి కోలుకున్న తర్వాత అనారోగ్యం కారణంగా మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించారు.

చేతన్ చౌహాన్​

డీన్​ జోన్స్​ - క్రికెటర్ (1961-2020)

ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్(59) గుండెపోటుతో సెప్టెంబరు 24న మరణించారు. ఐపీఎల్ 13వ సీజన్​లో వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి భారత్​ వచ్చిన ఈయన, ముంబయిలోని ఓ హోటల్​లో తుదిశ్వాస విడిచారు.

డీన్​జోన్స్​

చునీ గోస్వామి - ఫుట్​బాలర్ (1938-2020)

భారత దిగ్గజ ఫుట్​బాలర్​ చునీ గోస్వామి.. ఈ ఏడాది ఏప్రిల్​ 30న కోల్​కతాలో కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఈయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

చునీ గోస్వామి

చునీ గోస్వామి (పాత చిత్రం)

డిగో మారడోనా - ఫుట్​బాలర్ (1960-2020)

డీగో మారడోనా

నవంబరు రెండో వారంలో మెదడు శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన మారడోనా.. రెండు వారాల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. ఆ తర్వాత నవంబరు 25న గుండెపోటుతో కన్నుమూసి తన అభిమానులను శోకసంద్రంలో ముంచారు.

పాలో రోసీ (ఫుట్​బాల్​)- (1956-2020)

ఇటలీ దిగ్గజ ఫుట్​బాలర్ పాలోరోసీ(64) డిసెంబరు 9న కన్నుమూశాడు. దిగ్గజ మారడోనా మరణించిన కొద్దిరోజులకే రాసీ మృతి చెందడం ఫుట్‌బాల్‌ అభిమానులను కలచివేసింది.

పాలో రోసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.