లెజండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్(Milkha Singh) ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi) ఆరా తీశారు. మిల్కా సింగ్ పూర్తిగా కోలుకొని ఆరోగ్యవంతుడిగా త్వరలోనే తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి ఆరోగ్యంతో వచ్చి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు ఆయన ప్రేరణగా నిలుస్తారని అన్నారు.
ఏం జరిగిందంటే?
ఆక్సిజన్ స్థాయిలు పడిపోయిన కారణంగా భారత స్టార్ అథ్లెట్ మిల్కా సింగ్ గురువారం రాత్రి మరోసారి ఆసుపత్రిలో చేరారు. వెంటనే చికిత్స కోసం ఆయన్ను ఐసీయూ(Milkha Singh in ICU)కు తరలించారు. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
మే 20న మిల్కా సింగ్(Milkha Singh Corona)కు కరోనా సోకింది. చికిత్స నిమిత్తం మొదట మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం నిలకడగా ఉండగా.. ఆసుపత్రి నుంచి గత ఆదివారమే డిశ్ఛార్జ్ అయ్యారు. కానీ ప్రస్తుతం ఆక్సిజన్ స్థాయిలు పడిపోయిన కారణంగా చండీగఢ్‌లోని పీజీఐఎమ్ఈఆర్ ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో మిల్కా సింగ్ ఆరోగ్యంపై ప్రస్తుతం ప్రధాని మోదీ ఆరా తీశారు.
ఇదీ చూడండి: ఐసీయూలో దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్