ETV Bharat / sports

ఈ సక్సెస్​ మంత్రతో ముందుగు సాగండి- కామన్​వెల్త్​ అథ్లెట్లకు మోదీ దిశానిర్దేశం - pm modi about commonwealth games 2022

కామన్​వెల్త్​ గేమ్స్​-2022లో పాల్గొనే భారత క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు క్రీడాకారులకు సక్సెస్​ మంత్రను బోధించారు మోదీ. కొందరు క్రీడాకారుల అనుభవాలను మోదీ తెలుసుకున్నారు.

PM Modi gives success mantra to India's Birmingham-bound CWG 2022 contingent
ఈ సక్సెస్​ మంత్రతో ముందుగు సాగండి- కామన్​వెల్త్​ అథ్లెట్లకు మోదీ దిశానిర్దేశం
author img

By

Published : Jul 20, 2022, 1:32 PM IST

ఇంగ్లాండ్​లోని బర్మింగ్​హామ్​ వేదికగా జరగనున్న కామన్​వెల్త్​ గేమ్స్​లో పాల్గొనే క్రీడాకారులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. బుధవారం వారితో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆకాంక్షించారు. అయితే ఆటలు ఆడే క్రమంలో ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని సూచించారు మోదీ. 'క్యూ పడే హో చక్కర్ మే.. కోయీ నహీ హై టక్కర్ మే' అనే సక్సెస్​ మంత్రతో ముందుకు సాగాలన్నారు. భారత క్రీడా చరిత్రలోనే.. ఈ కాలం చాలా కీలకమైందన్నారు ప్రధాని మోదీ.

PM Modi gives success mantra to India's Birmingham-bound CWG 2022 contingent
వీడియో కాన్ఫరెన్స్​లో ప్రధాని మోదీ

" భారత క్రీడా చరిత్రలో.. ఇది చాలా ముఖ్యమైన కాలం. మీలాంటి చాలామంది క్రీడాకారులు స్ఫూర్తిని నింపుతున్నారు. శిక్షణ కూడా చాలా మెరుగవుతోంది. క్రీడల పట్ల చాలా మంది ఆసక్తిని కనబరుస్తున్నారు. కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారు."

-ప్రధాని మోదీ.

కామన్​వెల్త్​ గేమ్స్​ ఆడటానికి వెళ్తున్న వారిలో చాలా మంది ఇప్పటికే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఉంటారని, అయితే తొలిసారి వెళ్తున్న వారికి తన తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మోదీ పేర్కొన్నారు. మొదటిసారిగా పాల్గొనబోతున్న 65 మంది అథ్లెట్లు.. క్రీడా ప్రపంచంలో తమదైన ముద్రవేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరో 10 రోజుల్లో ప్రపంచ వేదికపై భారతీయ అథ్లెట్ల మెరుపులను అందరం చూస్తామన్నారు. మనసు పెట్టి ఆడితే విజయం మీదే అని చెప్పారు మోదీ.

"మీరు ఎలా ఆడాలనే విషయంలో నేను చెప్పేది ఒక్కటే. మనసు పెట్టి ఆడండి. మీ పూర్తి శక్తిని వినియోగించి.. ఎలాంటి టెన్షన్ లేకుండా ఆడండి."

-ప్రధాని మోదీ.

ఇటీవల అమెరికాలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్న.. స్టీపుల్ ఛేజ్​ రన్నర్ అవినాశ్​ సేబల్ సాబుల్‌తో ప్రధాని సంభాషించారు. ఆర్మీలో పనిచేయడం.. తన ప్రాక్టీస్​కు ఎలా సాయపడిందో ప్రధానికి వివరించాడు అవినాశ్.

వెయిట్ లిఫ్టర్ అచింత షేయులీ కూడా ప్రధానితో ప్రత్యేకంగా మాట్లాడారు. శక్తికి మంచిన ఆట ఆడే క్రమంలో ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావని మోదీ అచింతను అడిగారు. ప్రశాంతంగా ఉండటానికి తాను యోగా చేస్తానని మోదీకి బదులిచ్చాడు.

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ట్రీసా జాలీతో సైతం ప్రధాని మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా తనకు బ్యాడ్మింటన్ ఆడాలన్న కోరిక ఎలా పుట్టిందనే విషయాన్ని ట్రీసా చెప్పగా.. మోదీ ఆసక్తిగా విన్నారు. 'మా ఊరిలో వాలీబాల్, ఫుట్‌బాల్‌కు ఎక్కువ ఆదరణ ఉన్నప్పటికీ.. మా నాన్న నన్ను బ్యాడ్మింటన్ ఆడేలా ప్రేరేపించారు' అని ఆమె మోదీ వివరించారు.

ఇంగ్లాండ్​లోని బర్మింగ్​హామ్​ వేదికగా జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్న కామన్​వెల్త్​ గేమ్స్​లో 19 క్రీడా విభాగాల్లో.. 141 ఈవెంట్లలో.. 215 మంది అథ్లెట్లు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఇదీ చదవండి: 'పంత్‌ లాంటి కెప్టెన్‌ ఉంటే టీమ్‌ఇండియాకు మంచిది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.