ETV Bharat / sports

'ఒలింపిక్​ ఛాంపియన్'​గా నల్లజాతీయుడు.. అదే తొలిసారి! - 1960 రోమ్​ ఒలింపిక్స్

టోక్యో ఒలింపిక్స్​కు సమయం దగ్గర పడుతోంది. జులై 23 నుంచి ఈ ప్రతిష్టాత్మక పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత ఒలింపిక్స్​ విశేషాలు, ఆసక్తికర సన్నివేశాలు తెలుసుకుందామా..

1952 helsinki olympics, 1956 melbourne olympics
1952 హెల్సింకీ ఒలింపిక్స్, 1956 మెల్​బోర్న్ ఒలింపిక్స్
author img

By

Published : Jul 20, 2021, 5:30 PM IST

టోక్యో ఒలింపిక్స్​కు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రతిష్టాత్మక ఈ ఈవెంట్​కు సంబంధించి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి చేశారు నిర్వాహకులు. ఈ నేపథ్యంలో 1952, 1956, 1960 విశ్వక్రీడలకు సంబంధించిన విశేషాలు, ఆసక్తికర విషయాలు మీకోసం..

హెల్సింకీ ఒలింపిక్స్​-1952

  • తొలిసారిగా ఇజ్రాయెల్​ హెల్సింకీ ఒలింపిక్స్​లో పాల్గొంది.
  • 1912 తర్వాత సోవియట్​ యూనియన్​ తిరిగి ఈ విశ్వ క్రీడల్లోకి ప్రవేశించింది.
  • తూర్పు బ్లాక్ దేశాలకు వ్యతిరేకంగా సోవియట్​ యూనియన్​ ఒలింపిక్ క్రీడా గ్రామాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ప్రచ్ఛన యుద్ధం ప్రభావం క్రీడలపై పరోక్షంగా కనిపించింది.
  • సోవియట్​ యూనియన్​ విచ్ఛిన్నమయ్యే వరకు యూఎస్​ఎస్​ఆర్​ మహిళ జిమ్నాస్ట్​లు 40 ఏళ్ల పాటు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
  • హెల్సింకీ క్రీడల్లో జర్మనీ, జపాన్​ దేశాలు తిరిగి ప్రవేశించాయి. జర్మనీ రెండు ప్రాంతాలుగా విడిపోయి ఈ క్రీడల్లో పాల్గొనాలనుకుంది. ఇందుకోసం తూర్పు జర్మనీ దరఖాస్తు చేసుకోగా.. అది తిరస్కరణకు గురైంది. పశ్చిమ జర్మనీ ఆటగాళ్లతోనే ఆ దేశం ఒలింపిక్స్​లో పాల్గొంది.
  • చెక్​ రిపబ్లిక్​కు చెందిన అథ్లెట్​ ఎమిల్​ జటోపెక్​ ఈ ఒలింపిక్స్​లో మూడు స్వర్ణాలు కైవసం చేసుకుంది. 5000 మీ., 10000 మీ. పోటీల్లో టైటిల్​ను నిలబెట్టుకుంది.
  • వ్యక్తిగత ఈక్వెస్ట్రియన్​ డ్రెస్సెజ్​ పోటీలో డెన్మార్క్ క్రీడాకారిణి లిస్ హర్టెల్ రజత పతకం గెలుచుకుంది.

ఇదీ చదవండి: Olympics: ఒలింపిక్స్​ కోసం ఇరుకు గదుల్లోనే బస!

మెల్​బోర్న్ ఒలింపిక్స్​-1956

  • ఒలింపిక్స్​కు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని ఒక్క ఓటు తేడాతో గెలుచుకుంది మెల్​బోర్న్​.
  • దక్షిణార్ధ గోళంలో ఈ మెగా ఈవెంట్​ జరగడం ఇదే మొదటి సారి. అది కూడా నవంబర్​- డిసెంబర్​లో నిర్వహించడం తొలిసారి.
  • ఈ ఒలింపిక్స్​లో భాగంగా జరగాల్సిన గుర్రపు పోటీలు ఆస్ట్రేలియాలో జరగలేదు. అక్కడ విధించిన కఠిన నిర్బంధ నియమాలే ఇందుకు కారణం. దీంతో ఒలింపిక్స్​కు ఐదు నెలల ముందే మెల్​బోర్న్​కు 9,700 మైళ్ల దూరంలో ఉన్న స్టాక్​హోం వేదికగా ఈ పోటీలు జరిగాయి.
  • సినాయ్ ద్వీపకల్పంలో ఇజ్రాయెల్​ దండయాత్ర నిర్వహించినందుకు నిరసనగా ఈజిప్టు, లెబనాన్, ఇరాక్​.. మెల్​బోర్న్​ ఒలింపిక్స్​ను బాయ్​కాట్​ చేశాయి.
  • హంగేరీపై సోవియట్​ దండయాత్రకు నిరసనగా స్పెయిన్, నెదర్లాండ్స్​, స్విట్జర్లాండ్​ వంటి పాశ్చాత్య దేశాలు ఈ మెగా క్రీడల నుంచి తప్పుకున్నాయి.
  • రిపబ్లిక్​ ఆఫ్ చైనా(తైవాన్​) ఈ క్రీడల్లో పాల్గొన్న కారణంగా పీపుల్స్​ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈ ఆటలను తిరస్కరించింది.
  • తూర్పు, పశ్చిమ జర్మనీ దేశాలు ఒకే జట్టుగా పోటీలోకి దిగాయి.
  • ఈ మెల్​బోర్న్​ ఒలింపిక్స్​లో యూఎస్​ బాస్కెట్​బాల్​ జట్టు ప్రత్యర్థి జట్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
  • దేశాల అక్షర క్రమంలో కాకుండా అథ్లెట్లు అందరూ కలిసి ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ప్రపంచ ఐక్యతకు చిహ్నంగా భావించారు నిర్వాహకులు.

రోమ్​ ఒలింపిక్స్​-1960

  • 1906లో అర్ధంతరంగా ఆతిథ్య హక్కులను వదులుకున్న రోమ్​కు.. తిరిగి 1960లో క్రీడలను నిర్వహించే అవకాశం లభించింది.
  • ప్రారంభ, ముగింపు వేడుకలు నిర్వహించడానికి ఒలింపిక్ స్టేడియాన్ని నిర్మించారు. దీంతో పాటు ట్రాక్​ అండ్ ఫీల్డ్​, స్పోర్ట్స్ ప్యాలెస్​ కట్టారు నిర్వాహకులు. అనేక పురాతన ప్రదేశాలను క్రీడా వేదికలుగా పునరుద్ధరించారు.
  • ఒలింపిక్స్​ చరిత్రలో తొలిసారిగా నల్లజాతి ఆఫ్రికా అథ్లెట్​ అబేబే బికిలా.. మారథాన్​ ఛాంపియన్​గా నిలిచాడు. కనీసం కాళ్లకు చెప్పులు లేకుండా పరుగెత్తి రికార్డు సృష్టించాడు.
  • అమెరికా ప్రొఫెషనల్ బాక్సర్​ మహ్మద్​ అలీ లైట్​-హెవీవెయిట్​ విభాగంలో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు.
  • స్పైరోస్ సమరస్​ స్వరపరిచిన గీతాన్ని ఒలింపిక్​ గీతంగా స్వీకరించాలని ఐఓసీ నిర్ణయించింది. 1960 విశ్వక్రీడల్లో తొలి సారిగా ఈ సాంగ్​ను వినిపించారు.
  • ఈ ఒలింపిక్స్​ 18 ఐరోపా దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. కొన్ని గంటల తేడాతో అమెరికా, కెనడా, జపాన్​లోనూ వీక్షించారు అభిమానులు.

ఇదీ చదవండి: Olympics: మ్యాచ్​లు ఓడినా.. పతకం గెలిచిన అమెరికా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.