ETV Bharat / sports

Tokyo Olympics: ఒలింపిక్స్​లో తొలిసారి ఓ ట్రాన్స్​జెండర్

ఒలింపిక్స్​లో పాల్గొనబోతున్న తొలి ట్రాన్స్​జెండర్​గా న్యూజిలాండ్​కు చెందిన వెయిట్​లిఫ్టర్​ లారెన్ హబ్బర్డ్ రికార్డు సృష్టించింది. జులై 23 నుంచి జరగగనున్న ఈ పోటీల్లో లారెన్, మహిళ విభాగంలో పోటీపడనుంది.

Laurel Hubbard
లారెన్ హబ్బర్ట్
author img

By

Published : Jun 21, 2021, 12:17 PM IST

న్యూజిలాండ్‌కు చెందిన లారెల్ హబ్బర్డ్ (Laurel Hubbard) రికార్డు సృష్టించారు. ఒలింపిక్స్‌లో (Olympics)లో పాల్గొననున్న తొలి ట్రాన్స్‌జెండర్ అథ్లెట్‌(Transgender Athlete)గా ఘనత వహించారు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో లారెన్ పాల్గొనే విషయమై న్యూజిలాండ్ ఒలింపిక్ కమిటీ అధికారిక ప్రకటన చేసింది. దీంతో క్రీడాలోకంతో పాటు పలువురు లారెన్​ను ప్రశంసిస్తున్నారు. ఒలింపిక్స్‌లో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక కేటగిరీ లేకపోవడం వల్ల హబ్బర్డ్ మహిళల విభాగంలోనే బరిలోకి దిగనుంది. 2013 వరకు ఆమె పురుషుల కేటగిరీలో పోటీపడింది.

జూనియర్ లెవల్ నుంచే

ఈమె అసలు గెవిన్ హబ్బర్డ్. జూనియర్ స్థాయి పోటీల్లోనే పలు జాతీయ రికార్డులు నెలకొల్పింది. ట్రాన్స్​జెండర్​గా మారిన తర్వాత 2017లో జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్​లో రజతంతో పాటు 2019 పసిఫిక్ గేమ్స్​లో స్వర్ణంతో మెరిసింది. 2018 కామన్వెల్త్​ పోటీల్లో పాల్గొన్నా సరే గాయం కారణంగా మధ్యలోనే తప్పుకుంది.

Laurel Hubbard
లారెన్ హబ్బర్ట్

వ్యతిరేకత

అయితే కొందరు మాత్రం హబ్బర్డ్​ మహిళల విభాగంలో పోటీపడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పురుషుడి నుంచి మహిళగా మారిన వ్యక్తిని ఈ కేటగిరీలో ఎలా ఆడనిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. బెల్జియన్ వెయిట్ లిఫ్టర్​ అన్నా వాన్​బెలింగెన్ కూడా ఇదే విషయమై అసంతృప్తి వ్యక్తం చేసింది. హబ్బర్ట్​ను పోటీలకు అనుమతించడం, అదీ మహిళల విభాగంలో చోటు ఇవ్వడం పెద్ద జోక్​లా ఉందంటూ వ్యాఖ్యానించింది.

ఐఓసీ నిబంధనల ప్రకారమే

ఇటీవలే ఒలింపిక్ కమిటీ ట్రాన్స్​జెండర్​ అథ్లెట్ల విషయంలో కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. పురుషుడి నుంచి మహిళగా లింగమార్పిడి చేసుకున్న వారు మహిళా విభాగంలో పోటీపడవచ్చని ఇందులో స్పష్టం చేసింది. అందుకు వారు తాను మహిళ అన్న అంగీకార పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే పోటీలకు అనుమతించే సమయానికి ముందు ఏడాది వరకు ఆమె టెస్టోస్టెరాన్ లెవల్స్​ ఐఓసీ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఐఓసీ.. హబ్బర్డ్​కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇవీ చూడండి: నాన్న మరణం ఓ వైపు.. టెస్టు అరంగేట్రం మరోవైపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.