ETV Bharat / sports

'కెమెరాలన్నీ నావైపే ఉండాలని కోరుకోను - డైమెండ్ లీగ్​లో మాత్రం అలా జరగట్లేదు'

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 1:37 PM IST

Neeraj Chopra ODI World Cup 2023 : వన్డే ప్రపంచకప్ ఫైనల్స్​ను వీక్షించేందుకు ఎంతో మంది స్టార్స్​ అహ్మదాబాద్​కు తరలి వచ్చారు. అందులో జావెలిన్​ త్రో ప్లేయర్​ నీరజ్‌ చోప్రా కూడా ఉన్నాడు. అయితే ఆ వేదికపై అతడికి అవమానం జరిగిందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. దీనిపై నీరజ్‌ స్పందించాడు. ఇంతకీ నీరజ్ ఏమన్నాడంటే ?

Neeraj Chopra ODI World Cup 2023
Neeraj Chopra ODI World Cup 2023

Neeraj Chopra ODI World Cup 2023 : వన్డే ప్రపంచకప్​ ఫైనల్ మ్యాచ్​ను వీక్షించేందుకు ఎంతో మంది సెలబ్రిటీలు నరేంద్ర మోదీ స్టేడియానికి వచ్చారు. అందులో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఉన్నారు. వీరందరూ అభిమానులతో పాటు స్టాండ్స్​లో కూర్చుని టీమ్​ఇండియాకు సపోర్ట్ చేశారు. ఈ క్రమంలో గ్యాలరీలోఉన్న సినీ స్టార్స్​ను కెమెరాలు ఫోకస్ చేశాయి. కానీ, ఒలింపిక్‌ పతక విజేత నీరజ్‌ చోప్రాను మాత్రం ఒక్కసారి కూడా స్క్రీన్​పై చూపించలేదు. అసలు ఈ ఫైనల్‌ చూసేందుకు అతడు వచ్చినట్లు నీరజ్​ షేర్‌ చేసిన ఫొటోల ద్వారానే అభిమానులకు తెలిసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అప్పట్లోనే ఈ విషయంపై విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ విమర్శలపై నీరజ్‌ చోప్రా స్పందించాడు.

"కెమెరాలు నావైపు ఉన్నాయా? లేవా? అనే ఆలోచనే నాకు రాలేదు. కాకపోతే నాదొక చిన్న విజ్ఞప్తి. నేను పోటీపడేటప్పుడు నన్ను చూపిస్తే చాలు. డైమండ్‌ లీగ్‌ను సరిగ్గా టెలికాస్ట్‌ చేయడం లేదు. కొన్నిసార్లు కేవలం హైలైట్స్‌ను మాత్రమే టెలికాస్ట్​ చేస్తున్నారు. డైమండ్‌ లీగ్‌తో పాటు ఇతర పోటీలను ప్రసారం చేయడం ముఖ్యమైన అంశం. అంతేకానీ, ఎక్కడికెళ్లినా.. కెమెరాలన్నీ నావైపు ఉండాలని నేనెప్పుడూ కోరుకోను. అహ్మదాబాద్‌ మ్యాచ్‌కు నేను వచ్చింది కేవలం గేమ్‌ను ఆస్వాదించడానికే కానీ కెమెరాల్లో నేను కనిపించాలని కాదు. భారత్‌ గెలిచి ఉంటే ఇంకా సంతోషపడేవాడిని. ఫైనల్‌ను స్టాండ్స్‌లో నుంచి చూడటం నాకు చాలా ఆనందంగా అనిపించింది " అని చోప్రా తన అభిప్రయాన్ని వ్యక్తం చేశాడు.

  • Team India, you made us proud. Hard luck in the final. It wasn't our night, but a tournament that we'll never forget. 🇮🇳 pic.twitter.com/mDfeSINJHH

    — Neeraj Chopra (@Neeraj_chopra1) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'నా రోల్ మోడల్​ అతడే - క్రికెట్​లో మాత్రం'
"జావెలిన్‌ త్రోయర్‌గానే కాకుండా నేను కూడా క్రికెట్‌ ఆడతాను. బ్యాటింగ్‌ కూడా చేయగలను. బౌలింగ్‌లో మాత్రం విసిరేందుకే (నవ్వుతూ) ఆసక్తి చూపుతాను. జావెలిన్‌ త్రోలో జాన్‌ జెలెనీ నా రోల్‌ మోడల్. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన ఈ అథ్లెట్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ జావెలిన్‌ త్రోయర్​గా ప్రసిద్ధికెక్కారు. జావెలిన్‌ను 98.48 మీటర్లు విసిరి రికార్డు సృష్టించాడు. క్రికెట్‌లో అయితే బుమ్రా నా ఫేవరేట్‌ బౌలర్‌. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నోవేషన్‌ ల్యాబ్‌లో నేను చాలా నేర్చుకున్నాను. 2016-17 సమయంలో నేను అక్కడ ట్రైనింగ్​ కూడా తీసుకున్నాను. ఇప్పటికీ నాకు గుర్తుంది. అద్భుతమైన ట్రైనింగ్‌ లభించింది" అని నీరజ్‌ తెలిపాడు.

Neeraj Chopra Won Gold Medal : గోల్డ్ గెలిచిన నీరజ్​ చోప్రా.. సిల్వర్​తో మెరిసిన కిషోర్ జెనా

Neeraj Chopra Latest Interview : 'ఆ సమయంలో గోల్కొండ మెట్లపై పరిగెత్తాను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.