ETV Bharat / sports

జోన్స్​తో మ్యాచ్​ కోసం ఎదురుచూస్తున్నా: టైసన్

author img

By

Published : Oct 30, 2020, 4:12 PM IST

త్వరలో జరగనున్న ఛారిటీ బాక్సింగ్​ మ్యాచ్​పై దిగ్గజ బాక్సర్ మైక్​ టైసన్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయ్​ జోన్స్​తో తలపడేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. లాస్​ ఏంజెలిస్​లో జరగనున్న ఈ పోటీలో ఇరువురూ హెడ్​గార్డ్​ లేకుండానే తలపడనున్నారు.

Mike tyson_ Roy jones Jr
రాయ్​ జాన్స్​​తో పంచ్​కు రెడీ: మైక్​ టైసన్
మాటకు మాట

తన మనసెంతో ఆనందంగా ఉందని మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్​ టైసన్​ అన్నాడు. రాయ్​ జోన్స్​ జూనియర్​తో త్వరలోనే ఓ ఛారిటీ మ్యాచ్​లో తలపడనున్న నేపథ్యంలో టైసన్​ ఈ వ్యాఖ్యలు చేశాడు. నవంబర్​ 28న లాస్​ ఏంజెలిస్​లో జరగనున్న ఈ పోటీకి సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇరువురూ తగువులాడారు. బాక్సింగ్​ పోటీల్లో గెలవడం నుంచి డ్రగ్స్​ తీసుకోవడం వరకు అన్నిటి గురించి ప్రస్తావించారు.

హోరాహోరీగా..

ఇరువురు బాక్సర్లూ 50 ఏళ్లకు మించిన వారే. అయినా, కాలిఫోర్నియా రాష్ట్ర అథ్లెటిక్​ కమిషన్​ ఇచ్చిన హెడ్​గార్డ్స్​ పెట్టుకోకుండా పోటీపడనున్నట్లు పేర్కొన్నారు. ఈ మ్యాచ్​లో విజేత అయిన వారికి 'ఫ్రంట్​లైన్​ బ్యాటిల్ బెల్ట్'​ ఇవ్వనుంది డబ్ల్యూబీసీ.

రికార్డుల్లో ఇరువురూ ఇలా..

రాయ్​ జోన్స్​ జూనియర్(51) దిగ్గజ బాక్సర్​గా పేరొందాడు. 1989 నుంచి 2018 వరకు.. మిడిల్​ వెయిట్, సూపర్​ మిడిల్​ వెయిట్, లైట్​ హెవీ వెయిట్​, హెవీ వెయిట్​ బాక్సింగ్​ టైటిల్స్ సొంతం చేసుకున్నాడు.

'బ్యాడెస్ట్​ మ్యాన్​ ఆన్​ ది ప్లానెట్​'గా పేరు సంపాదించాడు దిగ్గజ బాక్సర్​ టైసన్​. 20 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్​గా నిలిచాడు. కానీ, 1990లో బస్టర్​ డౌగ్లాస్​తో ఓటమి తర్వాత టైసన్​ కోలుకోలేకపోయాడు. ఆ తర్వాత టైసన్​పై రేప్​, డ్రగ్స్ ఆరోపణలు కూడా వచ్చాయి. 2005లో తన చివరి మ్యాచ్ ఆడాడు.

ఇదీ చదవండి:సిక్స్​తో లాస్ట్ పంచ్ ఇచ్చిన క్రికెటర్లు వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.