ప్రతి నెల జరిగే 'మన్ కీ బాత్' కార్యక్రమంలో రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 'ఖేలో ఇండియా' గేమ్స్ మూడవ ఎడిషన్‌లో పాల్గొన్న వారందరినీ అభినందించారు. అట్టడుగు స్థాయిలో ఉన్న క్రీడలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భాజపా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమ ప్రచారం జనవరి 22 ముగిసింది. ఈ ప్రచారంలో 6000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రధాని తన ప్రసంగంలో అనేక మంది క్రీడాకారుల గురించి ప్రస్తావించారు. ఇందులో అండమాన్‌కు చెందిన 'డేవిడ్ బెక్‌హామ్' పేరు కూడా ఉంది.
"నేను ఇప్పుడు 'డేవిడ్ బెక్‌హామ్' గురించి చెప్పాలనుకుంటున్నా. డేవిడ్ బెక్‌హామ్ అంటే మీరు కచ్చితంగా పుట్‌బాల్ ఆటగాడని పొరపడతారు. ఆయన పుట్‌బాల్‌లో ఉన్నతమైన ఆటగాడు. కానీ, ఇప్పుడు మన మధ్య 'డేవిడ్ బెక్‌హామ్' ఉన్నాడు. గువహటిలో జరిగిన యూత్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించాడు. సైక్లింగ్‌లో 200 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్‌లో మేటిగా నిలిచాడు."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
డేవిడ్ మొదట 2017లో దిల్లీలో సైక్లింగ్‌లో శిక్షణ పొందాడు. 17 ఏళ్ల వయసులో సునామి కారణంగా తండ్రిని కోల్పోయాడు. పది సంవత్సరాల తర్వాత తన తల్లి సంక్రమణ కారణంగా మరణించిందని బెక్‌హామ్ వెల్లడించాడు.
ఇదీ చూడండి.. రెండో మ్యాచ్‌లో పరిస్థితులు మారాయి: రాహుల్