ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ మనుబాకర్ అదరగొట్టింది. చైనా పుతియాన్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో పసిడి కైవసం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం నెగ్గింది.
మొత్తం 244.7 పాయింట్లు సాధించి జూనియర్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేసింది మనుబాకర్. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రపంచకప్ స్వర్ణం నెగ్గిన రెండో భారత షూటర్‌గా ఘనత సాధించింది. ఇంతకు ముందు ఈ టోర్నీలో హీనా సిద్దు గోల్డ్ గెలిచింది. ఈ పోటీలో మరో భారత షూటర్ యశస్విని దేశ్వాల్ ఆరో స్థానంలో నిలిచింది.
-
GOLD! 🥇 🥇 🥇 A brilliant @realmanubhaker demolishes a top class field to win her first @ISSF_Shooting World Cup final 🥇 in the Women’s 10m Air Pistol! And in junior world record score of 244.7 as well!!! Awesome! @RaninderSingh @WeAreTeamIndia @Media_SAI @KirenRijiju pic.twitter.com/kVK2kOuJDU
— NRAI (@OfficialNRAI) November 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">GOLD! 🥇 🥇 🥇 A brilliant @realmanubhaker demolishes a top class field to win her first @ISSF_Shooting World Cup final 🥇 in the Women’s 10m Air Pistol! And in junior world record score of 244.7 as well!!! Awesome! @RaninderSingh @WeAreTeamIndia @Media_SAI @KirenRijiju pic.twitter.com/kVK2kOuJDU
— NRAI (@OfficialNRAI) November 21, 2019GOLD! 🥇 🥇 🥇 A brilliant @realmanubhaker demolishes a top class field to win her first @ISSF_Shooting World Cup final 🥇 in the Women’s 10m Air Pistol! And in junior world record score of 244.7 as well!!! Awesome! @RaninderSingh @WeAreTeamIndia @Media_SAI @KirenRijiju pic.twitter.com/kVK2kOuJDU
— NRAI (@OfficialNRAI) November 21, 2019
అయితే మంగళవారం జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. రెండు ర్యాపిడ్ ఈవెంట్లలో కలిపి 583 పాయింట్లు సాధించిన మను.. త్రుటిలో తుదిపోరుకు చేరలేకపోయింది. మరో షూటర్ రాహీ సర్నోబాత్ కూడా ఈ పోటీలో నిరాశపరిచింది.
ఇదీ చదవండి: పింక్ టెస్టుతో పెద్ద పండగే: గంగూలీ