ETV Bharat / sports

రూమర్స్​పై స్పందించిన ఉసేన్​ బోల్ట్​​.. అవన్ని నిజాలు కావంటూ..

ఇటీవలే తన ఖాతాలో నుంచి 12 మిలియన్‌ డాలర్లు మాయమైన విషయంపై స్పందించారు దిగ్గజ స్పింటర్​ ఉసేన్​ బోల్ట్​. అంతే కాకుండా తన పై వస్తున్న రూమర్స్​కు చెక్​ పెట్టారు బోల్ట్​.

usain bolt
usain bolt
author img

By

Published : Feb 1, 2023, 1:13 PM IST

దిగ్గజ స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ బ్యాంక్​ అకౌంట్​ నుంచి సుమారు 12 మిలియన్‌ డాలర్లు మాయమైన విషయం వల్ల అతను మానసికంగా కుంగిపోయారని సోషల్​ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అవన్ని అసత్యాలంటూ ఆయనే వెల్లడించారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన అసలు విషయాన్ని బయట పెట్టారు.

''మనం కష్టపడి సంపాదించిన రూపాయి కళ్లముందే పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విషయం నాకు బాధాకరం.. చాలా నిరాశ చెందాను. అయితే నేను మానసిక వేదనకు గురయినట్లు కొన్ని వార్తలు వినిపించాయి. ఈ విషయంలో నాకు నేను కన్ఫ్యూజ్‌ అయ్యను. ఒక్క విషయం క్లారిటీగా చెప్తున్నా. డబ్బు పోయినందుకు బాధగానే ఉన్నప్పటికి మనసు మాత్రం ముక్కలవ్వలేదు. ఆ డబ్బు ఎలా రాబట్టుకోవాలనేది మా లాయర్లు చూసుకుంటారు. ఆ బాధ్యతను వారికి అప్పగించాను. నా ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. మీకందరికి తెలుసు నాకు ముగ్గురు పిల్లలు.. వాళ్లతో పాటు నా తల్లిదండ్రులను కూడా చూసుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో అనవసర ఒత్తిడికి గురవ్వడం ఇష్టం లేదు. ఏం రాసిపెట్టుంటే అదే జరుగుతుంది.'' అని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.