భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ భార్య, భారత మహిళల వాలీబాల్ మాజీ కెప్టెన్ నిర్మలా కౌర్.. కన్నుమూశారు. కొవిడ్ సంబంధ సమస్యలతో ఆమె గత నెల 26న మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. ఆమె భర్త మిల్కా సింగ్ ద్వారానే నిర్మలా కౌర్‌కు మహమ్మారి సోకింది.
తొలుత కరోనా బారిన పడిన మిల్కా సింగ్ కూడా ఈ ఫోర్టిస్ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. అనంతరం అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మళ్లీ ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉండడం వల్ల చండీగఢ్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మిల్కా సింగ్ ఐసీయూలోనే ఉన్నారు.
ఇదీ చదవండి: ICC Hall of Fame: వినూ మన్కడ్‌కు అరుదైన గౌరవం