ETV Bharat / sports

కంబళ వీరుడు శ్రీనివాసగౌడకు బెంగళూరులో శిక్షణ

కంబళ వీరుడు శ్రీనివాస గౌడకు రన్నింగ్​ ట్రాక్స్​పై తగిన శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా ముందుకొచ్చింది. ఏప్రిల్​ నుంచి బెంగళూరులోని స్వరాజ్​ మైదానంలో అతడికి తర్ఫీదు ఇవ్వనున్నట్లు తెలిపింది.

Kambala jockey may wear spikes at Sports Authority of India centre
కంబళ వీరుడు శ్రీనివాసగౌడకు బెంగళూరులో శిక్షణ
author img

By

Published : Feb 26, 2020, 2:45 PM IST

Updated : Mar 2, 2020, 3:29 PM IST

కంబళ వీరుడు శ్రీనివాసగౌడకు బెంగళూరులో శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(శాయ్) సుముఖత వ్యక్తం చేసింది. వంద మీటర్ల పరుగును అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన ఘనత సాధించటం వల్ల అతడికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ కారణంగా శ్రీనివాస్​కు తగిన శిక్షణ ఇప్పించాలని సోషల్​ మీడియాలో క్రీడాశాఖ మంత్రి కిరణ్​రిజుజుకు పలువురు సూచించారు. ఈ విషయంపై స్పందించిన కేంద్రమంత్రి రిజుజు అతడి శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని శాయ్​కు సూచించారు .

శాయ్​ దక్షిణభారత డైరెక్టర్​ అజయ్​కుమార్​ నేతృత్వంలోని అధికారులు ఈ విషయంపై గౌడతో చర్చించి, బెంగళూరులోని స్వరాజ్​ మైదానంలో శిక్షణకు రావాలని సూచించారు. శ్రీనివాస్​ గౌడకు ట్రాక్‌ల గురించి ఎటువంటి అవగాహన లేదు కాబట్టి అందుకు ప్రాథమిక తర్ఫీదు ఇస్తామని వారు తెలిపారు.

చిత్తడినేలలో కంటే ట్రాక్​పై చేసే పరుగులో చాలా వ్యత్యాసం ఉందని శ్రీనివాస్​ గౌడ అనుకున్నా.. తర్వాత శిక్షణ పొందటానికి అంగీకరించాడు. కంబళ పోటీలు మార్చి 7తో ముగియనున్నాయి. అయితే ఈ క్రమంలో గౌడ ఏప్రిల్‌ నుంచి శాయ్​లో చేరే అవకాశం ఉంది. ఈ పోటీల్లో ఇప్పటివరకు అతడు 39 పతకాలు సాధించాడు.

ఇదీ చూడండి.. 'భారత​ బోల్ట్' పరుగు చూశారా? అవి కాళ్లా.. కారు చక్రాలా!​

Last Updated : Mar 2, 2020, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.