ETV Bharat / sports

త్వరలో క్రీడా పాలసీ... క్రీడాకారులకు మేలు: జయేశ్ రంజన్ - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో త్వరలో మంచి క్రీడా పాలసీ వస్తుందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. టేబుల్ టెన్నిస్​లో పతకాలు సాధించిన ఆకుల శ్రీజ, స్నేహిత్​లకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి సన్మానం చేశారు. క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు.

jayesh-ranjan-disclosed-about-sports-policy-soon-in-lb-stadium-meeting-in-hyderabad-district
త్వరలో క్రీడా పాలసీ... క్రీడాకారులకు మేలు: జయేశ్ రంజన్
author img

By

Published : Feb 27, 2021, 7:02 PM IST

రాష్ట్రంలో త్వరలో ఉన్నతమైన క్రీడా పాలసీ వస్తుందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ వెల్లడించారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో క్రీడాకారులకు మరింత ప్రోత్సహం అందుతుందన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ టేబుల్ టెన్నీస్​లో పతకాలు సాధించిన ఆకుల శ్రీజ, స్నేహిత్​లను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి సన్మానించారు.

హర్యానాలోని పంచకులలో జరిగిన 82వ సీనియర్ టేబుల్ టెన్నిస్​లో మహిళలు, పురుషులు రెండు విభాగాల్లో శ్రీజ, స్నేహిత్​లు కాంస్య పతకాలు సాధించారు. 50 ఏళ్ల తర్వాత తెలంగాణకు నేషనల్ ఛాంపియన్ షిప్​లో పతకాలు రావడం గర్వకారణమని జయేశ్ రంజన్ అన్నారు. క్రీడల్లో కష్టపడితేనే ఫలితాలు వస్తాయని... అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందిస్తున్న జాతీయ టేబుల్ టెన్నిస్ కోచ్ సోమ్ నాథ్ ఘోష్​ను అభినందించారు.

ఇదీ చదవండి: పేదరికాన్ని దిగమింగి చిన్న వయసులోనే సివిల్​ జడ్జిగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.