టోక్యో ఒలింపిక్స్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు తెలిపారు జపాన్ ప్రధాని యొషిహిదె సుగా. ఏప్రిల్ 9న వైట్ హౌస్ పర్యటన నేపథ్యంలో అగ్రనేతను ఆహ్వానించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. జపాన్ పార్లమెంట్లో ఓ చట్టసభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన పీఎం.. 'అవును మేము ఆహ్వానించాలనుకుంటున్నాం' అని తెలిపారు.
ఈ దఫా ఒలింపిక్స్‌లో మొత్తం 15వేల 400 అథ్లెట్లు పోటీల్లో పాల్గొననున్నారు. వీరితో పాటు వేల సంఖ్యలో న్యాయ నిపుణులు, వీఐపీ, మీడియా, ప్రసారదారులు హాజరు కానున్నారు.
బైడెన్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత కలవనున్న మొదటి విదేశీ నేత సుగానే కానున్నారు. కాగా.. అమెరిగా పర్యటనకు ముందు జపాన్ ప్రధానితో సహా 80-90 మంది సహాయ సిబ్బందికి రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్ ఇవ్వనుంది జపాన్ ప్రభుత్వం.
ఇదీ చదవండి: కోహ్లీ మరో ఫీట్.. మూడో స్థానంలో 10వేల పరుగులు