ETV Bharat / sports

Olympics: ఆరంభ మ్యాచ్​లో ఆతిథ్య జపాన్​ శుభారంభం - టోక్యో ఒలింపిక్స్​ సాఫ్ట్​ బాల్​ మ్యాచ్​ జపాన్​ విజయం

రెండు రోజులు ముందే ఒలింపిక్స్​లోని(Tokyo olympics) కొన్ని క్రీడలు ప్రారంభమైపోయాయి. బుధవారం సాఫ్ట్​బాల్​ పోటీలు మొదలవ్వగా ఆరంభ మ్యాచ్​లో ఆస్ట్రేలియాపై ఆతిథ్య జపాన్​ గెలుపొందింది. రెండో మ్యాచ్​లో ఇటలీపై అమెరికా విజయం సాధించింది.

olympic
ఒలింపిక్స్​ సాఫ్ట్​ బాల్​
author img

By

Published : Jul 21, 2021, 12:20 PM IST

Updated : Jul 21, 2021, 12:40 PM IST

ఒలింపిక్స్(Tokyo olympics)​ మహా క్రీడాసంబరం లాంఛనంగా మొదలవడానికి రెండు రోజులు సమయం ఉండగానే కొన్ని పోటీలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం సాఫ్ట్​బాల్​ పోటీలు ప్రారంభమయ్యాయి. ​తొలి మ్యాచ్​లో​ ఆతిథ్య జపాన్ శుభారంభం చేసింది. ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియాను 8-1తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్​ విజయంలో 39 ఏళ్ల యుకికో వెనో(Yukiko Ueno) కీలకంగా వ్యవహరించింది.

ఈ మ్యాచ్​ను ఒలింపిక్స్​ ప్రధాన వేదిక నుంచి 150 మైళ్ల దూరంలో 30వేల మంది ప్రేక్షకులు ఒకేసారి కూర్చునే సామర్థ్యం ఉన్న స్డేడియంలో నిర్వహించారు. అయితే ప్రేక్షకులు లేకుండానే కేవలం ఒలింపిక్​ నిర్వాహకులు, మీడియా సమక్షంలో(మొత్తంగా 50మంది) ఈ ఈవెంట్​ జరిగింది. రెండో మ్యాచ్​లో ఇటలీపై అమెరికా 2-0 తేడాతో విజయం సాధించింది.

ఫుట్​బాల్​ పోటీలు కూడా బుధవారమే ప్రారంభం కానున్నాయి. బ్రెజిల్‌- చైనా పోరుతో ఈవెంట్​ మొదలుకానుంది. ఆపై ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌, నెదర్లాండ్స్‌-జాంబియా, జపాన్‌-కెనడా, బ్రిటన్‌-చిలీ తలపడతాయి. ఒలింపిక్స్‌ ఆరంభోత్సవం శుక్రవారం(జులై 23) ప్రారంభమవుతుంది. దాదాపు 11వేల మంది అథ్లెట్లు ఈ విశ్వక్రీడల్లో పాల్గొననున్నారు.

ఇదీ చూడండి: విశ్వక్రీడల్లో 'వింత నిబంధనలు'.. ఇవి తెలుసా?

Last Updated : Jul 21, 2021, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.