ETV Bharat / sports

Ali Raza: గోల్​కీపర్​గా సఫాయి కార్మికుడు.. రక్తం కారుతున్నా డోం​ట్​ కేర్​.. - ఫిఫా ప్రపంచ్​ కప్ ఇరాన్‌ గోల్‌కీపర్‌ అలీరజా

తనకు గాయమైన డోంట్​ కేర్​ అనుకున్నాడు ఆ గోల్​ కీపర్​. రక్తం కారుతూనే ప్రత్యర్థులను మట్టుకరిపించేందుకు బరిలోనే ఉన్నాడు. తన అద్భుతమైన ఆటతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. అతడే ఇరాన్​ గోల్​ కీపర్​ అలీరజా.

iran goal keeper ali reza beiranvand injury
iran goal keeper ali reza beiranvand
author img

By

Published : Nov 22, 2022, 8:50 AM IST

FIFA World Cup 2022 : ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో గాయపడినా.. ముక్కు నుంచి రక్తం కారుతున్నా కొద్దిసేపు మ్యాచ్‌లో కొనసాగి ఇరాన్‌ గోల్‌కీపర్‌ అలీరజా అభిమానులను ఆకర్షించాడు. మైదానంలోనే కాదు మైదానం బయటా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం అతడికి కొత్తేం కాదు. ఇరాన్‌లోని సరాబ్‌-ఎ-ఆస్‌ అనే చిన్న గ్రామంలో పుట్టిన రజాది పేద కుటుంబం. ఫుట్‌బాల్‌ ఆటగాడిగా మారాలన్నది అతడి కల. కానీ అతడి నాన్న అందుకు ఒప్పుకోలేదు.. రజాను గొర్రెలు కాసే పనిలో పెట్టాలని అనుకున్నాడు. కానీ తన ఫుట్‌బాల్‌ కలను తీర్చుకునేందుకు అలీరజా ఇంటి నుంచి టెహ్రాన్‌కు పారిపోయాడు.

ఇంటి నుంచి వచ్చిన తర్వాత తిండికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. కడుపు నింపుకోవడానికి కార్లు కడిగాడు.. పిజ్జా షాపులో పని చేశాడు. వీధులు ఊడ్చాడు. బట్టల కర్మాగారంలో కార్మికుడయ్యాడు. ఈ క్రమంలో ఇరాన్‌ ఒకప్పుటి స్టార్‌ అలీ దయీని పరిచయం కావడం అలీలో ఫుట్‌బాల్‌ కాంక్షను మరింత రగిలించింది. ఓ కోచ్‌ను బతిమాలి ఫీజులో రాయితీ పొంది తన దగ్గర ఉన్న కొన్ని డబ్బులు ఇచ్చి క్లబ్‌లో చేరాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ 2015లో ఇరాన్‌ గోల్‌కీపర్‌గా ఎదిగాడు. చిన్నప్పటి నుంచి రాళ్లను దూరంగా విసరడం అలీకి సరదా. అదే అతడికి ఓ ప్రత్యేకతగా మారింది.

2016లో దక్షిణ కొరియాతో ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో బంతిని 61.26 మీటర్ల దూరం విసిరిన అలీరజా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఎక్కువమంది గోల్‌కీపర్లు కాలితోనే బంతిని ఫ్రీకిక్‌ చేస్తారు. కానీ ఈ ఇరాన్‌ గోల్‌కీపర్‌ చేతితోనే చాలా శక్తిమంతమైన త్రోలు విసురుతాడు. ఈ ప్రపంచకప్‌లో సత్తా చాటాలని అలీ భావించాడు. కానీ ఆడిన తొలి మ్యాచ్‌లోనే గాయానికి గురయ్యాడు. ఎంత వేగంగా కోలుకుంటాడో చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.