భారత ఒలింపిక్ కమిటీ ఛైర్మన్ ఇంట్లో ఐదుగురికి కరోనా - నరీందర్ బాత్రా వార్తలు
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బాత్రాకు కరోనా సెగ తాకింది. తన తండ్రితో సహా ఇంట్లో పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి ఈ వైరస్ సోకినట్లు బాత్రా వెల్లడించారు.
తన తండ్రికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బాత్రా వెల్లడించారు. ఇంట్లో పనిచేస్తున్న మరో నలుగురికి సైతం వైరస్ సోకినట్లు స్పష్టం చేశారు. తనకు మాత్రం వైద్య పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని తెలిపారు.
"నా తండ్రికి కరోనా సోకింది. మే 25న ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించాం. మరో నలుగురు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వారూ అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం మా ఇంట్లో ఉండే 13 మందిలో నాతో కలిపి 8 మందికి నెగిటివ్ వచ్చింది. అయినా వారందరినీ 17 రోజులు హోం క్వారంటైన్లో ఉండమని సూచించాను"
-- నరీందర్ బాత్రా, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు
ఇదీ చదవండి: మరపురాని మెరుపులు: చిన్నస్వామిలో భారత్ గెలిచిన వేళ