13వ దక్షిణాసియా పోటీల్లో భారత్ పురుషులు, మహిళల ఖోఖో జట్లు ఆకట్టుకున్నాయి. ప్రత్యర్థులు బంగ్లాదేశ్, నేపాల్‌లను తుదిపోరులో ఓడించి స్వర్ణపతకాలు కైవసం చేసుకున్నాయి.
2016లో స్వర్ణాన్ని గెలిచిన భారత పురుషుల జట్టు.. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌పై 16-9స్కోరు తేడాతో విజయం సాధించింది. మహిళలు 17-5 తేడాతో నేపాల్‌పై మెరుపు వేగంతో దూసుకుపోయి గెలిచారు.
తైక్వాండోలో భారత్‌కు 6 పతకాలు
ఇక్కడే జరుగుతోన్న తైక్వాండో పోటీల్లో భారత్.. మూడు స్వర్ణాలు సహా ఆరు పతకాలను కైవసం చేసుకుంది. 53 కిలోల విభాగంలో లిఖిత, 74 కిలోల విభాగంలో జర్నెల్ సింగ్, 73 కిలోలపైగా ఉన్న విభాగంలో రుడాలి.. బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. 63 కిలోల విభాగంలో సౌరభ్, గాంగ్జోట్ రజతం.. 86 కిలోల విభాగంలో చైతన్య కాంస్యతో సరిపెట్టుకున్నాడు.
ఇది చదవండి: బీసీసీఐ నూతన చీఫ్ సెలక్టర్ అతడేనా?